హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రాంచంద్రయ్యకు పదవి:వీరశివ అలక, సిఎం బుజ్జగింపు

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తిరుపతి శాసనసభ్యుడు చిరంజీవి వర్గం శాసనమండలి సభ్యుడు సి.రామచంద్రయ్యను కిరణ్ కుమార్ రెడ్డి తన మంత్రివర్గంలోకి తీసుకోవడంపై కమలాపురం ఎమ్మెల్యే వీర శివా రెడ్డి అలిగారు. సి.రామచంద్రయ్య, గంటా శ్రీనివాస్ రావులు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం వీర శివా రెడ్డి ముఖ్యమంత్రిని కలిసి తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు లేఖను అందజేశారు. అయితే కిరణ్ మాత్రం రాజీనామాను స్వీకరించలేదు. రాజకీయాల్లో అన్నీ అనుకున్నట్లే జరగవని, ఇటువంటి పరిణామాలు సహజమేనని సిఎం వీర శివా రెడ్డికి హితబోధ చేసినట్లుగా తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ అవిశ్వాస తీర్మానం పెట్టిన సమయంలో చిరంజీవి ప్రభుత్వాన్ని ఆదుకున్నందున ఆయన వర్గంలో వారు కోరిన ఇద్దరికి మంత్రిగా అవకాశం ఇచ్చామని చెప్పారని తెలుస్తోంది. అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటే మంచి భవిష్యత్తు ఉంటుందని సూచించినట్లుగా సమాచారం. దీంతో వీర శివా రెడ్డి వెనక్కి తగ్గినట్లుగా తెలుస్తోంది.

అనంతరం తనను కలిసిన విలేకరులతో వీర శివా రెడ్డి, తాను సిఎంకు రాజీనామా లేఖను అందించానని, ఆయతే ఆయన వద్దని తిరస్కరించారని, తన ప్రయోజనాలకు ఎలాంటి అడ్డంకులు లేకుండా చూసుకుంటానని హామీ ఇచ్చారని చెప్పినట్లుగా తెలుస్తోంది. కాగా సి.రామచంద్రయ్యకు పదవి ఇచ్చే విషయమై వీర శివా మొదటి నుండి వ్యతిరేకిస్తున్నారు. ఆయనకు పదవి ఇస్తే జిల్లాలో పార్టీకి నష్టమని ఇటీవల అన్నారు. కాగా సిఆర్‌కు పదవి రావడంతో ఈ విషయమై జిల్లా నేతలు హైదరాబాదులో సమావేశం కానున్నట్లుగా సమాచారం.

English summary
Kamalapuram MLA Veera Siva Reddy disappointed very much with cabinet post to C Ramachandraiah. He gave his resignation to CM on thursday but Kiran rejected it.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X