జగన్ బాధ్యత మాది కాదు, వైయస్ మా పార్టీ: ఉండవల్లి

పరిటాల హత్య కేసులో జగన్ పాత్ర ఉందని చంద్రబాబు విమర్శిస్తే జగన్‌కు సంబంధం లేదని కిరణ్ కుమార్ రెడ్డి అప్పట్లో శాసనసభలో వాదించారని, ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదిస్తే చంద్రబాబుకు జగన్ మద్దతిచ్చారని ఆయన అన్నారు. ఈ విషయాన్ని తమ పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ స్పష్టంగా చెప్పినట్లు ఆయన గుర్తు చేశారు. తాము అధికారంలోకి వస్తే వైయస్సార్ విగ్రహాలను కూలుస్తామని చంద్రబాబు అనడం హేయమని ఆయన అన్నారు. అనుమతి లేకుండా విగ్రహాలు పెడితే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయవచ్చునని, కానీ చంద్రబాబు అలా మాట్లాడడం సరి కాదని ఆయన అన్నారు. ఎన్టీఆర్ విగ్రహాలను అనుమతి లేకుండా ఎన్ని చోట్ల పెట్టారో చంద్రబాబుకు తెలియదా అని ఆయన అడిగారు. వీరేశలింగం విగ్రహం స్థాపించాల్సిన చోట ఎన్టీఆర్ విగ్రహాన్ని నెలకొల్పారని, అది కూడా ఎన్టీఆర్ హత్యకు కారణమైనవారేనని, రాజమండ్రి వస్తే అనుమతి లేకుండా ఎన్ని ఎన్టీఆర్ విగ్రహాలు పెట్టారో చూపిస్తానని ఆయన అన్నారు.
వైయస్ రాజశేఖర రెడ్డికి సంబంధించిన అక్రమాస్తుల వివరాలు ఉంటే బయట పెట్టవచ్చునని ఆయన అన్నారు. కానీ పంది అనడం ఇంగితజ్ఞానం ఉన్నవారు మాట్లాడే మాటలు కావని ఆయన అన్నారు. నిరాధారమైన ఆరోపణలు చేయడం, అసభ్యకరమైన పదజాలం వాడడడం చంద్రబాబుకు తగదని, చంద్రబాబులాంటి నాయకుడు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని ఆయన అన్నారు. పార్టీ పడుతుందనే భయం ఉండవచ్చు, దాన్ని బలోపేతం చేసుకోవడానికి ప్రయత్నించవచ్చు, వైయస్‌పైనా కాంగ్రెసుపైనా విమర్శలు చేయవచ్చునని, కానీ అసభ్యకరమైన పదజాలం వాడకూడదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications