డబ్బుల కోసమే పదవులు: చిరంజీవిపై చంద్రబాబు

వైయస్ రాజశేఖర రెడ్డి తన కుమారుడు వైయస్ జగన్‌కు లక్షల కోట్లు దోచి పెట్టారని ఆయన ఆరోపించారు. అడవి పందిలా రాష్టాన్ని దోచేశారని ఆయన ఆరోపించారు. అనర్హులను వైయస్సార్ అందలం ఎక్కించారని ఆయన అన్నారు. వైయస్సార్ నాయకులకు, అధికారులకు దోచిపెట్టారని ఆయన ఆరోపించారు. ప్రజలు గొడ్డుబోయిన కాంగ్రెసు పార్టీకి పట్టం కట్టారని ఆయన అన్నారు. తమ పాలనలో చిన్న చిన్న పొరపాట్లు జరిగాయని ఆయన అంగీకరించారు. తాము అధికారంలోకి వస్తే మత్స్య కారులకు ఉచితంగా ఇళ్లు కట్టించి ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు. నెల్లూరు జిల్లా పార్టీ నాయకులతో కూడా ఆయన సమావేశమయ్యారు. వారికి ఆనయ క్లాస్ తీసుకున్నారు. పని చేయకపోతే ఎంతటివారైన సరే వారిని పక్కన పెడతామని ఆయన హెచ్చరించారు. పార్టీని ఫణంగా పెడుతున్నారని, అటువంటి వారికి టికెట్లు ఇచ్చేది లేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications