డిడిఆర్సీలో దేవినేని వర్సెస్ జోగి, నాని:పోర్ట్‌పై రసాభాస

Devineni-Perni Nani
విజయవాడ/విశాఖపట్నం: కృష్ణా జిల్లా విజయవాడలో జరిగిన డిడిఆర్సీ సమావేశం శుక్రవారం రసాభాసగా మారింది. కల్తీసారా, గొల్లపల్లి భూముల వ్యవహారం, బందరు పోర్టు నిర్మాణంపై సమావేశంలో వాడి వేడి చర్చలు జరిగాయి. కల్తీసారా విషయమై తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే దేవినేని ఉమా మహేశ్వర రావు, కాంగ్రెసు ఎమ్మెల్యే జోగి రమేష్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఒకరినొకరు పరస్పరం దూషించుకున్నారు. కాపుసారా తయారీదారులపై పిడియాక్టు ఎందుకు పెట్టలేదంటూ ఎమ్మెల్సీ జెల్లి విల్సన్ ప్రశ్నించారు. గొల్లపల్లి భూముల వ్యవహారం పైన తీవ్ర గలాటా జరిగింది. బందరు పోర్టు నిర్మాణం చేపట్టాలంటూ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు ఆందోళనకు దిగారు. పోర్టు నిర్మాణంపై ఎందుకు స్పష్టమైన ప్రకటన చేయడం లేదని ప్రశ్నించారు. ఎమ్మెల్యే పేర్ని నానిపై టిడిపి నేతలు విరుచుకు పడ్డారు. పోడియం వద్దకు దూసుకు పోయి అక్కడే బైఠాయించారు. గల్లా అరుణ కుమారి మాత్రం వారికి నచ్చజెప్పే ప్రయత్నాలు చేశారు. అంతకుముందు ఇరిగేషన్ సిఈ గైర్హాజరీపై ప్రజాప్రతినిధులు మండిపడ్డారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. కాగా ఈ సమావేశం సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరుగుతోంది. ఈ సమావేశానికి జిల్లా ఇంచార్జ్ మంత్రి గల్లా అరుణ కుమారి, మాధ్యమిక విద్యాశాఖ మంత్రి పార్థసారథి, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు.

పోర్టు నిర్మాణంపై చర్చ జరుగుతున్న సమయంలో మీడియాను అనుమతించాలని టిడిపి నేతలు డిమాండ్ చేయగా మీడియా లోపలకు వస్తే తాము బయటకు వెళతామని ఎంపీలు లగడపాటి రాజగోపాల్, కావురి సాంబశివ రావులు చెప్పారు. మరో ఎమ్మెల్యే కూడా ఎంపీలకు మద్దతుగా నిలిచారు. టిడిపి నేతలు దీనిని ఖండించారు. ఎంపీల వైఖరిని నిరసిస్తూ వారు సమావేశాన్ని బహిష్కరించారు.

మరోవైపు విశాఖపట్నం జివిఎంసి సమావేశం కూడా రసాభాసగా మారింది. ఆస్తి పన్ను పెంపుపై తెలుగుదేశం, సిపిఎం పార్టీలు అధికార పార్టీని నిలదీశాయి. ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఆస్తి పన్ను పెంపకంలో స్పష్టత లేదని, ప్రజలు అయోమయంలో ఉన్నారని, ఇందుకు జవాబు చెప్పవలసిన బాధ్యత కొన్సిల్ పైన ఉందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత రవిరాజు అన్నారు. ఆస్తి పన్ను తగ్గించాలంటూ సిపిఎం సభ్యులు మేయర్‌ను నిలదీశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+