శాఖలపై చిరంజీవి మీద నెగ్గిన కిరణ్ కుమార్ రెడ్డి

గురువారం ప్రమాణ స్వీకారం చేసిన సి. రామచంద్రయ్యను, గంటా శ్రీనివాసరావును శుక్రవారం ఉదయం అల్పాహార విందుకు క్యాంప్ కార్యాలయానికి పిలిపించుకున్నారు. కొత్తగా వచ్చిన వారికి కీలక శాఖలు అప్పగిస్తే... అలకలు, అసంతృప్తులు మరింత పెరుగుతాయని, ప్రస్తుతానికి ఈ శాఖలతోనే సరిపెట్టుకోండని కిరణ్ వారికి చెప్పినట్లు తెలిసింది. పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ కూడా రంగంలోకి దిగి, శాఖల విషయంలో పంతానికి పోవద్దని కొత్త మంత్రులకు చెప్పినట్లు సమాచారం. దీంతో శాఖల కేటాయింపు గొడవ సద్దుమణిగింది. శనివారం జరిగే పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో ఈ విషయంపై చర్చ జరిగే అవకాశం ఉంది. ఈ సమావేశంలో గులాం నబీ ఆజాద్ సమక్షంలో శనివారం సాయంత్రం జరుగుతుంది.












Click it and Unblock the Notifications