చిరుతో విభేదాలు లేవు, రామచంద్రయ్య మిత్రుడు: డిఎల్

పార్టీకి, ప్రభుత్వానికి మధ్య సమన్వయం సాధించడానికి మాత్రమే కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్ ప్రయత్నిస్తారని ఆయన చెప్పారు. రామచంద్రయ్య విషయంలో శాసనసభ్యుడు వీరశివా రెడ్డి ఢిల్లీలో చెప్పినప్పుడు తాను హైదరాబాదు వస్తున్నానను, కూర్చోబెట్టి మాట్లాడిస్తానని ఆజాద్ చెప్పారని, తనకు ఏ విధమైన అభ్యంతరాలు లేవు కాబట్టి తనను కూర్చోబెట్టాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. రామచంద్రయ్యకు అన్ని వర్గాలతో మంచి సంబంధాలున్నాయని, అన్ని వర్గాల గురించి రామచంద్రయ్య ఆలోచిస్తారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications