పార్టీల గుండెల్లో రైళ్లు: పోరుయాత్రపై కిషన్ రెడ్డి

తమ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తథ్యమని ఆయన అన్నారు. బిజెపి అధికారంలోకి వస్తే తెలంగాణ ఏర్పడుతుందని, బిజెపి తెలంగాణపై స్పష్టమైన వైఖరితో ఉందని ప్రజలు నమ్ముతున్నారని, దీంతో ప్రజల్లో బిజెపి పట్ల విశ్వసనీయత పెరుగుతోందని ఆయన అన్నారు. 2014లో బిజెపి అధికారంలోకి వస్తే తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తుందని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు పార్లమెంటులో బిల్లు ప్రతిపాదించాలని ఆయన యుపిఎ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి రైతు సమస్యలు పట్టడం లేదని ఆయన విమర్శించారు.












Click it and Unblock the Notifications