వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్‌కు నాగం మద్దతు పలికినందుకే సస్పెండ్: రేవంత్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Revanth Reddy
మహబూబ్ నగర్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన సాక్షి పత్రిక ప్రకటనల విషయంలో తప్పు జరిగిందని కాగ్ నివేదిక తేల్చినా ఆ పత్రికకు, జగన్మోహన్ రెడ్డికి తెలంగాణ నగారా సమితి చైర్మన్ నాగం జనార్ధన్ రెడ్డి మద్దతు పలికినందు వల్లే ఆయనను పార్టీ నుండి బహిష్కరించారని తెలుగుదేశం పార్టీ నేత రేవంత్ రెడ్డి శనివారం అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి ఉంటే తాను కాంగ్రెసులో చేరేవాడినని నాగం విమర్శిస్తున్నారని, ఆయన అలా అనుకుంటే 2007లో స్వతంత్ర అభ్యర్థిగా ఎమ్మెల్సీగా గెలిచినప్పుడే వెళ్లే వాడిని సమాధానమిచ్చారు. కాని అప్పుడే కాంగ్రెసులో కాకుండా టిడిపిలో చేరానని చెప్పారు. నాగంతో వ్యక్తిగత చర్చకు తాను సిద్ధంగా ఉన్నానన్నారు.

తెలంగాణ కోసం శాసనసభ్యులు అందరూ రాజీనామాలు చేసిన సమయంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఢిల్లీ వెళ్లారని, ఇప్పుడు మాత్రం పోరు బాట చేయడం విడ్డూరమన్నారు. రాజీనామాకు ఆయన ఎందుకు ముందుకు రాలేదన్నారు. ఆయన తెలంగాణ పోరు యాత్రను ఎవరూ నమ్మరన్నారు. కిషన్ రెడ్డి, నాగం ఇద్దరూ తెలంగాణ ద్రోహులేనన్నారు. నాగంకు టిడిపి నుండి బహిష్కరించిన తర్వాత తెలంగాణ గుర్తుకు వచ్చిందా అని ప్రశ్నించారు.

English summary
TDP leader Revanth Reddy said that Nagam Janardhan Reddy supported Sakshi and YS Jaganmohan Reddy after CAG report also.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X