జయలలిత పంజా: మరో డిఎంకె మాజీ మంత్రి అరెస్టు

ఇంతకు ముందు వీరపాండి అరుముగం, కె. పొన్ముడి, కెఎన్ నెహ్రూ అరెస్టయ్యారు. వీరికి ఈ కేసుల్లో బెయిల్ కూడా లభించింది. మరో మాజీ మంత్రి కెపి సామి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కుంటూ జైలులో ఉన్నారు. ఆయనకు కూడా ఇటీవల సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. న్యాయమైన ఆరోపణలను పరిగణనలోకి తీసుకుని మాత్రమే అరెస్టులు జరుగుతున్నాయని జయలలిత అంటున్నారు. అయితే రాజకీయ కక్షలో భాగంగానే అరెస్టులు చేస్తున్నారని కరుణానిధి విమర్శిస్తున్నారు. తమిళనాడు మాజీ ఉప ముఖ్యమంత్రి, కరుణానిధి కుమారుడు ఎంకె స్టాలిన్‌పై కూడా కేసు నమోదైంది.












Click it and Unblock the Notifications