గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వేధించే బదులు నన్ను కాల్చి చంపండి: వైయస్ జగన్

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
గుంటూరు: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధినేత జగన్మోహనరెడ్డి మంగళవారం గుంటూరు జిల్లా ఓదార్పు యాత్రలో సంచలన వ్యాఖ్యలు చేశారు. గురజాల మండల కేంద్రంలోని బహ్మనాయుడు సెంటరు వద్ద ఆయన పర్యటిస్తుండగా తన సన్నిహితుడిని సునీల్‌ రెడ్డిని సిబిఐ అదుపులోకి తీసుకుందనే సమాచారం అందుకున్నారు. దీంతో ఆయన ఉద్విగ్నంగా ప్రసంగించారు. సిబిఐ ద్వారా తనను వేధిస్తున్నారని, అలా వేధించే బదులు తనను కాల్చ చంపాలని ఆయన అన్నారు. రాష్ట్రంలో మూడో పార్టీ ఉండకూడదని తెలుగుదేశం, కాంగ్రెసు భావిస్తున్నాయని, అందుకే తననూ తన కుటుంబ సభ్యులను వేధిస్తున్నారని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్‌ పార్టీ సిబిఐని తన మీదకు ఉసిగొలుపుతోందన్నారు. నిత్యం వేధింపులకు గురయ్యే కన్నా సిబిఐ ద్వారా తనను ఒకేసారి కాల్చి చంపేస్తే బావుంటుందన్నారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్‌ కుమ్మక్కయిందని, తన ఎదుగుదలను చూసి ఓర్వలేకనే ఇటువంటి పనులు చేస్తున్నారన్నారు.

నీచ రాజకీయాలు చేసే బదులు తనను కాల్చి చంపేయాలని ఆయన అన్నారు. ఇచ్చిన మాట మీద నిలబడినందుకు - విలువలు, విశ్వసనీయత వైపు నిలిచినందుకు తన మీద అవినీతి ఆరోపణలతో అభాండాలు వేస్తున్నారని ఆయన అన్నారు. తనపై దొంగ కేసులు పెడుతున్నారని, తన కుటుంబాన్ని సర్వనాశనం చేసేందుకు పన్నాగాలు పన్నుతున్నారని ఆయన అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీని, జగన్మోహన్ రెడ్డిని లేకుండా చేసేందుకు క్రూర రాజకీయాలు చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. ఇలాంటి నీచ రాజకీయాలు చేసే బదులు కాల్చి చంపేకూడదా అని ఆయన అన్నారు.

English summary
YSR Congress president YS Jagan lashed out at Congress and Telugudesam.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X