చిరుపై వెనక్కి తగ్గిన బాలకృష్ణ, 'ఆమె'ను పట్టించుకోను

Balakrishna
హైదరాబాద్: తిరుపతి శాసనసభ్యుడు, కాంగ్రెసు పార్టీ నేత చిరంజీవిపై హీరో నందమూరి బాలకృష్ణ వెనక్కి తగ్గినట్లుగా కనిపిస్తోంది. గురువారం ఆయన బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్‌లో జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయనను మీడియా పలకరించింది. చిరంజీవిపై ప్రశ్నించగా అందుకు బాలకృష్ణ నో కామెంట్ అన్నారు. తాను రాజకీయాల్లోకి వస్తానని బహిరంగ ప్రకటన చేసినప్పటి నుండి ఇటీవల వరకు చిరంజీవి, బాలకృష్ణల మధ్య వాగ్వుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. సామాజిక న్యాయం పేరుతో పార్టీని పెట్టిన వారు ఆ తర్వాత అమ్మేసుకున్నారని, తనను ఎవడో బాలుడు అన్నారని, పార్టీ ఆదేశిస్తే తాను చిరంజీవి పైనా పోటీకి సిద్ధమని ఇటీవల వివిధ సందర్భాల్లో సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు మాత్రం చిరంజీవిపై స్పందించడానికి ఆయన నిరాకరించారు. చిరంజీవి వ్యాఖ్యలపై తానేమీ స్పందించనన్నారు. మిగతా అంశాలపై స్పందించారు.

పార్టీ అధిష్టానం ఆదేశిస్తే ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ రాజీనామా చేసి మళ్లీ విజయవాడ నుండి పోటీ చేసి గెలవాలని సవాల్ చేశారు. త్వరలో తాను తెలంగాణలో పర్యటిస్తానని స్పష్టం చేశారు. ఎన్టీఆర్ టిడిపి అధ్యక్షురాలు లక్ష్మీ పార్వతి వ్యాఖ్యలను తాను పట్టించుకోనన్నారు. నా అభిమానులు సంయమనంతో ఉండాలని సూచించానన్నారు. ప్రముఖ దర్శకులు బాపుకు పద్మ అవార్డు రాకపోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. కాగా మోతి నగర్‌లో ఆయన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+