జగన్‌కు మంత్రి కాసు కుటుంబం మద్దతా?: కోడెల

Kodela Siv Prasad
గుంటూరు: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆందోళనకు మంత్రి కాసు వెంకట కృష్ణా రెడ్డి కుటుంబం మద్దతు పలకడమేమిటంటూ టిడిపి నేత కోడెల శివ ప్రసాద్ మండిపడ్డారు. వస్త్ర వ్యాపారులపై వేసిన వ్యాట్‌ను నిరసిస్తూ నరసారావుపేటలో శుక్రవారం ఓ వైపు టిడిపి, మరోవైపు జగన్ ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా టిడిపి నేత కోడెల శివ ప్రసాద్ మాట్లాడారు. జిల్లాకు చెందిన ఓ మంత్రి పదవి ఉంటే కాంగ్రెసులో, పదవి పోతే వైయస్సార్ కాంగ్రెసు అనేందుకే జగన్‌కు మద్దతు పలుకుతున్నారని మంత్రి కాసు వెంకట కృష్ణా రెడ్డిని ఉద్దేశించి అన్నారు. కాసు కుటుంబం జగన్ దీక్షకు మద్దతు పలకడం అనైతికమన్నారు. తమకు మొదట అనుమతిచ్చి మళ్లీ ఆ తర్వాత వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి ఆందోళన కోసం అనుమతి ఎందుకిచ్చారన్నారు. కులచిచ్చు రేపడానికే పోటీగా వారు ధర్నాకు దిగారన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి చనిపోయి మూడేళ్లయినా ఇప్పటి వరకు జగన్ ఓదార్పు నిర్వహించడంలో అర్థమేమిటని ప్రశ్నించారు.

కాగా వస్త్ర వ్యాపారులపై వేసిన వ్యాట్‌ను నిరసిస్తూ నరసారావుపేటలో టిడిపి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు పోటా పోటీకి దీక్షకు దిగిన విషయం తెలిసిందే. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీగా పోలీసులను మోహరించారు. టిడిపికి ఉదయం తొమ్మిది గంటల నుండి పదకొండు గంటల వరకు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి పదకొండు గంటల తర్వాత ఆందోళనకు అనుమతిచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+