హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎమ్మార్ కేసులో బిపి ఆచార్య అరెస్ట్,నాలుగోది

By Srinivas
|
Google Oneindia TeluguNews

BP Acharya
హైదరాబాద్: ఎమ్మార్ అక్రమాల కేసులో ఐఏఎస్ అధికారి బిపి ఆచార్యను సిబిఐ అధికారులు సోమవారం ఉదయం అరెస్టు చేశారు. ఎమ్మార్ కేసులో బిపి ఆచార్య ఎ-1 నిందితుడిగా ఉన్నారు. ప్రస్తుతం హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా పని చేస్తున్నారు. ఆయన అరెస్టును అధికారికంగా సిబిఐ ప్రకటించనప్పటికీ అందుకు సంబంధించిన ప్రక్రియ పూర్తి చేస్తున్నట్లుగా సమాచారం. మరికొద్దిసేపట్లో గాని, సాయంత్రంలోగా కానీ ఆయన అరెస్టును ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆచార్య శుక్రవారం నుండి సెలవుల్లో ఉన్నారు. సోమవారం వచ్చి తమ ఎదుట హాజరు కావాల్సిందిగా సిబిఐ ఆయనకు శనివారం నోటీసులు పంపించింది. దీంతో ఆయన సోమవారం వచ్చి సిబిఐ ఎదుట హాజరయ్యారు. మరో మూడు నాలుగు రోజుల్లో ఛార్జీషీట్ దాఖలు చేయాల్సిన సమయంలో బిపి ఆచార్యను అరెస్టు చేయడం గమనార్హం. ఆయనను సిబిఐ గతంలోనే పలుమార్లు విచారించింది.

ఆయనపై పలు సెక్షన్ల క్రింద సిబిఐ కేసు నమోదు చేసింది. నేరపూరిత కుట్ర, మోసం, అకౌంట్లు తారుమారు చేశారనే పలు అభియోగాలు మోపింది. ఎమ్మార్ ఒప్పందంలో ఏపిఐఐసి వాటా తగ్గినా ప్రేక్షక పాత్ర వహించారని ఎఫ్ఐఆర్‌లో సిబిఐ ఆరోపించింది. ప్రభుత్వ వాటా తగ్గడంలో ఆయనదే కీలక పాత్ర అని, మిత్రులకు, సహచరులకు విల్లాలు కేటాయించడంలో సూత్రదారి అని ఎఫ్ఐఆర్‌లో పేర్కొంది. కాగా ఇటీవల సునీల్ రెడ్డి తదితరులను సిబిఐ సైలెంట్‌గానే అరెస్టు చేసింది. ఆచార్య గతంలో ఎపిఐఐసి ఎండిగా పని చేశారు. కాగా ఎమ్మార్ కేసులో బిపి ఆచార్యది నాలుగో అరెస్టు. తనను సిబిఐ అరెస్టు చేసిందని ఆచార్య అధికారులకు సమాచారం అందించారు. బిపి ఆచార్యను రెండు రోజుల పాటు సిబిఐ కస్టడీకి అప్పగిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. సోమవారం సాయంత్రం 4 గంటల నుంచి ఎల్లుండి నాలుగు గంటల వరకు ఆచార్యను కోర్టు సిబిఐ కస్టడీకి అప్పగించింది. విల్లాల విక్రయాల్లో బిపి ఆచార్య కీలక సూత్రధారి అని సిబిఐ చెప్పింది.

English summary
CBI officers arrested IAS officer BP Acharya today in EMAAR case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X