హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జూడాలను చర్చలకు ఆహ్వానించలేదు: డిఎల్ స్పష్టం

By Pratap
|
Google Oneindia TeluguNews

DL Ravindra Reddy
హైదరాబాద్: జూనియర్ డాక్టర్లను చర్చలకు ఆహ్వానించలేదని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి స్పష్టం చేశారు. జూనియర్ డాక్టర్ల సమస్యలపై తాము ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో సమావేశమైనట్లు ఆయన మీడియా ప్రతినిధులతో చెప్పారు. జూనియర్ డాక్టర్ల సమస్యలపై మంత్రి ఉప సంఘం ఏర్పాటు చేస్తామని, మంత్రి వర్గ ఉప సంఘం చర్చించిన తర్వాతనే జూనియర్ డాక్టర్లను చర్చలకు ఆహ్వానిస్తామని ఆయన చెప్పారు. జూనియర్ డాక్టర్లతో మంత్రి వర్గ ఉప సంఘం చర్చలు జరుపుతుందని ఆయన అన్నారు. దీన్ని బట్టి జూనియర్ డాక్టర్ల డిమాండ్లను పట్టించుకోకూడదనే నిర్ణయానికి ప్రభుత్వం వచ్చినట్లు అర్థమవుతోంది.

జూనియర్ డాక్టర్ల సమ్మెపై కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. స్టయిఫండ్ చెల్లింపుపైనే ప్రధానంగా సమస్య జఠిలమైంది. జూనియర్ డాక్టర్ల డిమాండ్ మేరకు స్టయిఫండ్‌ను పెంచలేమని, ఇతర రాష్ట్రాల్లో కన్నా మన రాష్ట్రమే ఎక్కువగా చెల్లిస్తోందని ప్రభుత్వం చెబుతోంది. జూనియర్ డాక్టర్లు ఎంత వరకు సమ్మె చేస్తారో చూద్దామని ధోరణితో వ్యవహరించాలని ప్రభుత్వం అనుకుంటున్నట్లు అర్థమవుతోంది. కాగా, జూనియర్ డాక్టర్ల నిరాహార దీక్ష సోమవారం ఆరో రోజుకు చేరుకుంది. దీక్ష చేస్తున్న ఇద్దరు డాక్టర్ల ఆరోగ్యం కూడా క్షీణించింది. దాంతో వారికి ప్రతిపక్షాల మద్దతు పెరుగుతోంది.

English summary
Healyh minister DL Ravindra Reddy clarified that jr doctors were not invited for talks.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X