తెలంగాణపై తగ్గేది లేదు, ద్రోహుల కార్లలో వద్దు: ఎంపీలు

మంగళవారం టిఎన్జీవోలు తలపెట్టిన నిరసనకు తమ మద్దతు ప్రకటిస్తున్నామని చెప్పారు. తెలంగాణ ద్రోహులతో కలిసి ఎవ్వరూ వెళ్లవద్దన్నారు. తెలంగాణ ద్రోహులతో కలిసి కార్లలో తిరగవద్దని, వారి ఇళ్లకు వెళ్లవద్దన్నారు. హామీ మేరకు ఉద్యమంలో పాల్గొన్న తెలంగాణ విద్యార్థులు, ఉద్యమకారులపై కేసులు ఎత్తివేసే బాధ్యత ప్రభుత్వం మీదే ఉందన్నారు. ఐదు రాష్ట్రాలలో ఎన్నికలు ఉన్నందున త్వరలోనే మరోసారి సమావేశమై చర్చించి, భవిష్యత్తు ప్రణాళిక ప్రకటిస్తామని అన్నారు. అందరం ఐక్యంగా పోరాడుతామన్నారు. తెలంగాణ వాదులంతా ఏకం కావాలని వారు పిలుపునిచ్చారు.












Click it and Unblock the Notifications