సిబిఐ దిగజారుడు విచారణ: వైయస్ జగన్ పార్టీ నేత

కొందరి కనుసన్నల్లో సిబిఐ పనిచేస్తోందని ఆయన అన్నారు. తమ నేత జగన్ లక్ష్యంగా మాత్రమే సిబిఐ అధికారుల విచారణ జరుగుతోందని ఆయన విమర్శించారు. నార్కో అనాలిసిస్ టెస్టు పేరుతో విజయ సాయి రెడ్డి చెప్పని విషయాలను కూడా చెప్పినట్లు సిబిఐ వెల్లడించే అవకాశాలున్నాయని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా సిబిఐ విచారణ జరుగుతోందని ఆయన అన్నారు. 2014 ఎన్నికల లోపు జగన్‌ను అణగదొక్కే కుట్ర అమలవుతోందని ఆయన అన్నారు. ప్రధాని జోక్యం చేసుకుని నిష్పక్షపాతంగా విచారణ జరిగేలా చూస్తారని నమ్మకంతోనే విజయమ్మ లేఖ రాశారని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications