విజయ సాయి రెడ్డి ఒక్క ముక్కా చెప్పలేదు: సిబిఐ

నార్కో టెస్టులక కన్నా బలమైన టెస్టులకు విజయ సాయి రెడ్డి అర్హుడేనని సిబిఐ వాదించింది. విజయ సాయిరెడ్డిని 300 గంటల పాటు విచారించినా ఏ విధమైన సమాచారం ఇవ్వలేదని చెప్పింది. నిందితుని అనుమతితోనే నార్కో టెస్టులు నిర్వహించాలని సుప్రీంకోర్టు తెలిపిందని విజయ సాయి రెడ్డి తరఫు న్యాయవాది సుశీల్ కుమార్ వాదించారు. నార్కో టెస్టుల్లో చెప్పిన విషయాలను సాక్ష్యాలుగా పరిగణించలేమని కూడా సుప్రీంకోర్టు తెలిపిందని ఆయన అన్నారు. సిబిఐ వేసిన పిటిషన్‌పై వాదనలు పుర్తయ్యాయి. తీర్పును కోర్టు వచ్చే నెల 2వ తేదీకి వాయిదా వేసింది. కాగా, ఎమ్మార్ కేసులో స్టైలిష్ హోమ్స్ రంగారావు దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణను కోర్టు ఎల్లుండికి వాయిదా వేసింది. మరోవైపు, ఎమ్మార్ కేసులో సునీల్ రెడ్డిని సిబిఐ సోమవారం మూడో రోజు విచారించింది.












Click it and Unblock the Notifications