జగన్‌ను సిబిఐ విచారించడం కుట్రే: వైయస్ విజయమ్మ

మే 2009కి ముందు ఏ రాజకీయ హోదా లేని తన కుమారుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని విచారించడం రాజకీయ కుట్రలో భాగమేనని ఆమె అన్నారు. నిర్ణయాలు తీసుకున్న మంత్రులను వదిలేసి, వైయస్ రాజశేఖర రెడ్డి కుటుంబ ప్రతిష్టను దెబ్బ తీసే విధంగా సిబిఐ వ్యవహరిస్తోందని ఆమె విమర్శించారు. జగన్‌కు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పాలని సిబిఐ బెదిరిస్తోందని ఆమె అన్నారు. నిధులు దుబాయ్‌కి తరలించిన కోనేరు ప్రసాద్ కుమారుడిపై కూడా ఇప్పటి వరకు ఏ విధమైన చర్యలూ తీసుకోలేదని ఆమె అన్నారు. అన్ని పార్టీలకూ డబ్బు ఇచ్చానని కోనేరు ప్రాసద్ చెప్పారని, ఇప్పటి వరకు ఏ ఒక్క పార్టీవారిని కూడా విచారించకుండా ఒక్క వైయస్సార్ కాంగ్రెసు పార్టీవారినే వేధిస్తున్నారని ఆమె అన్నారు.












Click it and Unblock the Notifications
