అంబేడ్కర్ విగ్రహాల ధ్వంసం వెనక కుట్ర: బొజ్జా తారకం

ఇదిలా వుంటే, అంబేడ్కర్ విగ్రహాల విధ్వంసంపై దళిత మంత్రులు సమావేశమయ్యారు. ధ్వంసమైన విగ్రహాల స్థానంలో కాంస్య విగ్రహాలను నెలకొల్పాలని సమావేశానంతరం గీతా రెడ్డి అన్నారు. అసెంబ్లీ ప్రాంగణంలో కూడా అంబేడ్కర్ విగ్రహం నెలకొల్పాలని ఆమె డిమాండ్ చేశారు. విగ్రహ విధ్వంసానికి పాల్పడిన వారిపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టాలని కూడా ఆమె సూచించారు. విగ్రహాల విధ్వంసంపై మంత్రి వర్గ సమావేశంలో ప్రస్తావిస్తామని ఆమె చెప్పారు. త్వరలో హైదారబాద్‌లో దళితుల అభివృద్ధిపై జాతీయ స్థాయి సమావేశం ఏర్పాటు చేస్తామని మరో మంత్రి శైలజానాథ్ చెప్పారు. దళితులకు పదవుల్లో న్యాయమైన వాటా రావాలని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications