సాయి 'బెయిల్'పై కౌంటర్, సునీల్ కస్టడీపై హైకోర్టుకు

కాగా ఎమ్మార్ కేసులో అరెస్టైన సునీల్ రెడ్డిని తమ కస్టడీకి అప్పగించాలని కోరుతూ సిబిఐ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. సునీల్ రెడ్డిని మూడు రోజుల పాటు తమ కస్టడీకి తీసుకున్న సిబిఐ సోమవారం మరో వారం రోజులు తమకు అప్పగించాలని సిబిఐ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేయగా, కోర్టు అంగీకరించలేదు. దీంతో సిబిఐ హైకోర్టును ఆశ్రయించింది. మరోవైపు సోమవారం అరెస్టైన బిపి ఆచార్యకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆచార్య నీరసంగా ఉన్నారని, ఆయనకు ఎప్పటికప్పుడు గ్లూకోజ్ అందించాలని వైద్యులు సూచించారు. అనంతరం బిపి ఆచార్యను దిల్ కుషా అతిథి గృహానికి తరలించారు. ఆచార్య సతీమణి రంజనా ఆచార్య ఆయనను సిబిఐ ఆఫీసులో కలిశారు. కాగా ప్రభుత్వ సిఎస్ పంకజ్ ద్వివేదితో సిబిఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీ నారాయణ భేటీ అయ్యారు.












Click it and Unblock the Notifications