హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్, బాబు, మజ్లిస్ చెప్పాకే!: తెలంగాణపై చిదంబరం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chidambaram
హైదరాబాద్: రాష్ట్రంలోని నాలుగు ప్రధాన రాజకీయ పార్టీలు తెలంగాణ అంశంపై ఎప్పుడు తమ అభిప్రాయం చెబితే అప్పుడు అఖిలపక్షం ఏర్పాటు చేస్తామని కేంద్ర హోంమంత్రి చిదంబరం మంగళవారం ప్రకటించారు. తెలంగాణపై ఇప్పటికే భారతీయ జనతా పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి, సిపిఐ, సిపిఎం తమ అభిప్రాయాలు చెప్పాయి. ఇప్పటి వరకు అభిప్రాయం చెప్పనివి ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ, అధికార కాంగ్రెసు పార్టీ, ఇటీవల జగన్ స్థాపించిన వైయస్సార్ కాంగ్రెసు, మజ్లిస్ పార్టీలు మాత్రమే. దీంతో చిదంబరం తెలంగాణ అంశం గురించి మీడియా ఎప్పుడు ప్రస్తావించినా ఆ నాలుగు పార్టీలో అభిప్రాయం చెబితేనే కేంద్రం అఖిలపక్షం ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకుంటుందని చెబుతూ వస్తున్నారు. మంగళవారం కూడా ఆయన అదే చెప్పారు.

తెలంగాణపై అఖిలపక్షం ఎప్పుడు ఏర్పాటు చేస్తున్నారని మీడియా అడిగినప్పుడు ఆయన స్పందించారు. మీది అదే ప్రశ్న.. నాది అదే సమాధానం అని నవ్వుతూ చెప్పారు. కాగా ఇప్పటికే తమ అభిప్రాయం చెప్పామని, మరోసారి అఖిలపక్షం ఏర్పాటు చేసినా వెళ్లేది లేదని టిడిపి ఖరాఖండిగా చెబుతోంది. మరోవైపు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ, కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా తమకు అభ్యంతరం లేదని, నిన్న గాక మొన్న వచ్చిన తమ పార్టీ అభిప్రాయం అవసరం లేదని చెబుతోంది. మజ్లిస్, కాంగ్రెసులూ స్పష్టమైన అభిప్రాయం చెప్పలేదు.

English summary
Central Home Minister Chidambaram repeated his words on Telangana issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X