వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఒత్తిడితో ఆచార్య డిశ్చార్జ్: లాయర్, పిపిపై జడ్జి ఆగ్రహం

By Srinivas
|
Google Oneindia TeluguNews

BP Acharya
హైదరాబాద్: సిబిఐ అధికారుల ఒత్తిడి మేరకే నిమ్స్ వైద్యులు ఎమ్మార్ కేసులో అరెస్టైన బిపి ఆచార్యను హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేశారని ఆయన తరఫు న్యాయవాది గురువారం సిబిఐ ప్రత్యేక కోర్టులో జడ్జి ముందు తన వాదనలు వినిపించారు. బిపి ఆచార్యను నిమ్స్ నుండి రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో నిమ్స్ నుండి డిశ్చార్జ్ చేసిన విషయం తెలిసిందే. ఉదయం సిబిఐ అధికారులు ఆచార్యను కోర్టు ముందు హాజరు పర్చారు. ఈ సందర్భంగా ఆచార్య తరఫు న్యాయవాది, అనారోగ్యంతో ఉన్నప్పటికీ డిశ్చార్జ్ చేశారని, ఇది సిబిఐ ఒత్తిడి మేరకే జరిగిందని అన్నారు. అందుకు సిబిఐ తరఫు న్యాయవాది స్పందిస్తూ ఇలాంటి వ్యాఖ్యలు సరికావని, సిబిఐపై నిందలు వేయవద్దని అన్నారు. అలాగే మీడియాలో తప్పుడు వార్తలు వచ్చాయని పేర్కొన్నారు. ఇందుకు న్యాయమూర్తి నాగమారుతీ శర్మ పిపి(పబ్లిక్ ప్రాసిక్యూటర్)ని మందలించారు. నిందలు, మీడియా వార్తలు ఇక్కడ ప్రస్తావించవద్దని అన్నారు. అయినప్పటికీ పిపి వాటిని ప్రస్తావించడంతో న్యాయమూర్తి పిపిపై ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారు.

అనవసర వ్యాఖ్యలతో కోర్టు సమయాన్ని వృధా చేయవద్దని ఆగ్రహించారు. ఇలాంటి జడ్జిమెంట్ సమయాల్లో సిబిఐ జెడి లక్ష్మీ నారాయణ హాజరు కావాలని ఆదేశించారు. కాగా ఆచార్యకు కోర్టు ఈ నెల 15వ తారీఖు వరకు రిమాండ్ విధించింది. దీంతో ఆయనను చంచల్ గూడ జైలుకు తరలించారు. ఆచార్యను రెండు రోజుల సిబిఐ కస్టడీకి కోర్టు మంగళవారం అనుమతించిన విషయం తెలిసిందే. అదే రోజు సాయంత్రం ఆయనకు గుండెనొప్పి రావడంతో నిమ్స్‌కు తరలించారు. కాగా బిపి ఆచార్యపై ప్రభుత్వం వేటు వేసింది. నిబంధనల ప్రకారం 48 గంటల పాటు ఆయన జైళ్లో ఉండటంతో ఆయనను సస్పెండ్ చేసింది.

English summary
BP Acharya's lawyer accused CBI for his discharge from NIMS. Court sent him to remand for 15 days.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X