వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎమ్మార్ కుంభకోణం కేసు: 2002, 2010 మధ్య కుట్ర

By Pratap
|
Google Oneindia TeluguNews

CBI: Scam conspiracy was hatched during 2002-2010
హైదరాబాద్: ప్రభుత్వాన్నీ ఆంధ్రప్రదేశ్ మౌలిక సదుపాయాల కల్పనా సంస్థ (ఎపిఐఐసి)నీ మోసం చేయడానికి నిందితులు 2002, 2010 మధ్య కుట్ర చేశారని సిబిఐ ఎమ్మార్ కుంభకోణం కేసులో దాఖలు చేసిన చార్జిషీట్‌లో ఆరోపించింది. ఈ విషయం తమ దర్యాప్తులో వెల్లడైందని తెలిపింది. ఎమ్మార్ ప్రాపర్టీస్ సమీకృత ప్రాజెక్టుకు సంబంధిచిన విల్లా ప్లాట్లు, ఆపార్టుమెంట్లు, ఇతర వెంచర్ల విక్రయాల విషయంలో నిందితులు కుట్రకు పాల్పడ్డారని అభియోగం మోపింది. కుట్రలో భాగంగా ప్రభుత్వాధికారులు తమ హోదాలను దుర్వినియోగం చేసి ప్రైవేట్ రియల్ ఎస్టేట్ సంస్థలకు ప్రయోజనం చేకూర్చారని ఆరోపించింది.

విల్లాలను, ప్లాట్లను అధిక ధరలకు విక్రయించి, ఒప్పందంలో పేర్కొన్న ధరలకు మాత్రమే విక్రయించినట్లు ప్రైవేట్ రియల్ ఎస్టేట్ సంస్థలు చూపడానికి అధికారులు సహకరించారనేది ప్రధాన ఆరోపణ. పత్రాల్లో చూపిన ధరల కన్నా మించి వసూలు చేసిన సొమ్ము తమ జేబుల్లో వేసుకున్నారని చెప్పింది. ఎపిఐఐసి ప్రయోజనాలకు విఘాతం కల్పిస్తూ లీజు రెంటల్స్‌ను నిర్ణయించడంలో ఐఎఎస్ అధికారులు ఎల్వీ సుబ్రహ్మణ్యం, కె విశ్వేశరరావు ప్రధాన పాత్ర పోషించారని ఆరోపించింది. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన సమీకృత ప్రాజెక్టు లక్ష్యాలను దెబ్బ తీస్తూ అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించింది.

రంగారావు, కోనేరు ప్రసాద్, శ్రీకాంత్ జోషీ విల్లాలను, ప్లాట్లను అధిక ధరలకు విక్రయించే పాత్ర పోషించారని ఆరోపించింది. నిర్ణీత ధరలకు మించి వసూలు చేసిన సొమ్మును హైదరాబాద్, దుబాయ్‌లకు చెందిన రియల్ ఎస్టేట్ కంపెనీల ఖాతా పుస్తకాల్లో చేర్చలేదని సిబిఐ ఆరోపించింది. 26 శాతం వాటా ఉన్న ఎపిఐఐసికి అందులో వాటా ఇవ్వలేదని సిబిఐ అభియోగం మోపింది.

English summary
CBI in the chargesheet filed in the Emaar-APIIC case stated that investigation had revealed that the accused had hatched a conspiracy during 2002 to 2010 to defraud APIIC and the government in the sale of villa plots, apartments and other ventures pertaining to the Integrated Project.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X