వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

2జి కుంభకోణంతో పోరు ఆగదు: లోక్‌సత్తా జయప్రకాశ్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Jayaprakash Narayana
హైదరాబాద్: అవినీతిపై పోరు కేవలం 2జి కుంభకోణంతో ఆగదని సెజ్‌లు, గనుల కేటాయింపుల్లో లబ్ధి పొందిన అవినీతి నేతలందరికీ ఇది వర్తిస్తుందని లోక్‌సత్తా అధ్యక్షుడు, కూకట్ పల్లి శాసనసభ్యుడు జయప్రకాశ్ నారాయణ గురువారం అన్నారు. 2జి కుంభకోణం కేసులో కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంలో ఎదురు దెబ్బ తగిలిన విషయం తెలిసిందే. దీనిపై జెపి స్పందించారు. 2జి స్పెక్ట్రం కేసులో సుప్రీం ఇచ్చిన తీర్పును లోక్‌సత్తా పార్టీ స్వాగతిస్తుందన్నారు. ఈ తీర్పు అవినీతిపరులకు చెంపపెట్టు అన్నారు. భవిష్యత్తులో పటిష్ట లోక్‌‍పాల్ బిల్లు కోసం పోరు కొనసాగుతుందని ఆయన అన్నారు. బడ్జెట్ సమావేశాల్లో లోక్‌పాల్ బిల్లు ఆమోదం పొందేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు. 2జి కేసులో జెపి కక్షిదారుల్లో ఒకరు. ఆయన ఈ నెల 8న పార్లమెంటరీ స్థాయీసంఘం ముందు హాజరు కానున్నారు.

అంతర్ రాష్ట్ర బియ్యం ఎగుమతులపై నిషేధం విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గతంలో తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని జెపి అన్నారు. రాష్ట్రంలో రైతుల పరిస్థితి చాలా దారుణంగా ఉందన్నారు. ఈ నెల 17లోగా ఎగుమతుల నిషేధాన్ని ఎత్తివేయకపోతే 18న కర్నూలు జిల్లాలో పాదయాత్ర చేపట్టి నిబంధనలు ఉల్లంఘించి బియ్యాన్ని రాష్ట్రం దాటిస్తామని హెచ్చరించారు. ఆయన స్వతంత్ర రైతు సంఘాల సమాఖ్యకు నేతృత్వం వహిస్తున్నారు.

English summary
Loksatta chief Jayaprakash Narayana said that they will not stop fight against corruption with 2g scam only.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X