కార్మిక నేతను పోలీసులు కొట్టి చంపారు: జగన్

YS Jagan
కాకినాడ: యానాంలోని రీజెన్సీ సిరామిక్స్ కార్మిక నేత మురళీమోహన్‌ను పోలీసులు కొట్టి చంపారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. కార్మిక నేత మురళీమోహన్ కుటుంబ సభ్యులను ఆయన శుక్రవారం పరామర్శించారు. కుటుంబ సభ్యులను ఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. మురళీ మోహన్ చేసిన తప్పేమిటని ఆయన అడిగారు. కార్మిక నేతను పోలీసులు కొట్టి చంపి, గుండెపోటుతో మరణించాడని చెబుతున్నారని ఆయన ఆరోపించారు. ఈ విషయంపై ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమని ఆయన అన్నారు. కొట్టి చంపి మురళీమోహన్ గుండెపోటుతో మరణించినట్లు చిత్రీకరించడం బాధాకరమని ఆయన అన్నారు.

గొడవల్లో యాజమాన్య ప్రతినిధి చంద్రశేఖర్ మరణించడం కూడా బాధాకరమేనని ఆయన అన్నారు. పాండిచ్చేరి ప్రభుత్వ తీరుపై ఆయన ధ్వజమెత్తారు. కార్మిక నాయకుడు మురళీమోహన్ కార్మికుల హక్కుల కోసం పోరాటం చేయడం నేరమా అని ఆయన ప్రశ్నించారు. మురళీమోహన్ మృతి వల్లనే కార్మీకులు ఆందోళనకు దిగారని ఆయన అన్నారు. తొమ్మిది మంది కార్మికులు గాయపడితే ప్రభుత్వం నిద్రపోతోందా అని ఆయన అడిగారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+