ఆ పాపం ఊరికే పోదు: చంద్రబాబుపై వాసిరెడ్డి పద్మ

దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి నేత కార్మికుల కోసం పలు సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టారన్నారు. ఆయన మృతి తర్వాత వారిని ఎవరూ పట్టించుకోవడం లేదని, ప్రతిపక్ష నేతగా బాబు రెండేళ్లుగా ఎప్పుడైనా ప్రభుత్వాన్ని ప్రశ్నించారా అన్నారు. రాజకీయం కోసం బాబు ఏం చేసినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. వైయస్ అధికారంలోకి రాగానే ఆత్మహత్యలు చేసుకున్న చేనేత కుటుంబాలను ఆదుకునే ప్రయత్నం చేశారన్నారు. ఆత్మహత్యలను అపహాస్యం చేసిన బాబు ఇప్పుడు మాట్లాడటం విడ్డూరమన్నారు. రెండేళ్లుగా కాంగ్రెసు ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రశ్నించని బాబు ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నారన్నారు. ప్రజలు బాబు నమ్ముతారని అనుకోవడం భ్రమే అన్నారు.












Click it and Unblock the Notifications