సిఎం కాళ్లు పట్టుకుని పరువు తీశారు: పొన్నాలపై జూపల్లి

ప్రస్తుతం ఉన్న తెలంగాణ మంత్రులకే గౌరవం లేదని, కొత్తగా మంత్రి పదవులు తీసుకునే వారు ఏం ఉద్ధరిస్తారని ఆయన అన్నారు. శ్రీకృష్ణ కమిటీ నివేదికలోని 8వ అధ్యాయం అమలులో భాగంగానే తెలంగాణ శానససభ్యులకు మంత్రి పదవులు ఇస్తున్నారని ఆయన విమర్శించారు. తెలంగాణ కోసం జూపల్లి కృష్ణారావు మంత్రి పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత శాసనసభా సభ్యత్వానికి, కాంగ్రెసు పార్టీకి రాజీనామా చేసి తెరాసలో చేరారు. కాంగ్రెసు నుంచి మహబూబ్‌నగర్ జిల్లా కొల్లాపూర్ నుంచి శాసనసభకు ప్రాతినిధ్యం వహించిన ఆయన వచ్చే ఉప ఎన్నికల్లో అదే స్థానం నుంచి తెరాస తరఫున పోటీ చేయనున్నారు.












Click it and Unblock the Notifications