హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

శాఖల్లో భారీగా మార్పులు? చిరంజీవి ఎమ్మెల్యేలకు విప్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kiran Kumar Reddy
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మంత్రి వర్గంలో భారీగా మార్పులు చోటు చేసుకోనున్నాయనే ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి. తెలంగాణ ప్రాంతం నుండి ఇద్దరికి, కోస్తా నుండి ఒకరికి మంత్రివర్గంలో చోటు దక్కడంతో పాటు పలువురు మంత్రుల శాఖల్లో మార్పులు జరిగే అవకాశముందని వినిపిస్తోంది. మంత్రులు డిఎల్ రవీంద్రా రెడ్డి, జానా రెడ్డిల శాఖల్లో కోత పడనుందని వినిపిస్తోంది. డికె అరుణ శాఖలోనూ మార్పులు జరిగే అవకాశముందని తెలుస్తోంది. పాత మంత్రుల శాఖల్లో పెద్దగా మార్పులు లేకపోయినప్పటికీ కొత్త మంత్రుల శాఖల్లోనే మార్పులు ఉండే అవకాశం కనిపిస్తోంది. వాణిజ్య, విద్యుత్ శాఖల కోసం పోటా పోటీ ఉన్నట్లుగా సమాచారం. ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ కూడా ఆ పదవి చేపట్టినప్పటి నుండి హోంమంత్రి కోసం తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. సబితా ఇంద్రా రెడ్డిని ఆ శాఖ నుండి తప్పించి ఆయనకు కట్టబెట్టవచ్చుననే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే సిఎం కిరణ్ ప్రస్తుత పరిస్థితుల్లో అలాంటి సాహసానికి పూనుకునే అవకాశం లేదని కొందరు అభిప్రాయపడుతున్నారు. కొన్ని మార్పులు జరిగినప్పటికీ సామాజిక సమీకరణాల ఆధారంగా జరగనుందని తెలుస్తోంది.

కొత్త మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డికి వైద్య విద్య, ప్రసాద్ కుమార్‌కు చేనేత, జౌళీ, కొండ్రు మురళికి ఆర్‌డబ్లుఎస్ కట్టబెట్టవచ్చునని తెలుస్తోంది. చివరి నిమిషంలో మంత్రి వర్గంలో చోటు దక్కించుకోలేక పోయిన గండ్ర వెంకట రమణా రెడ్డికి చీప్ విప్, చిరంజీవి వర్గం ఎమ్మెల్యే వంగా గీత, బొబ్బిలి నుండి ఎన్నికైన సుజయ్ కృష్ణ రంగా రావు తదితరులకు విప్ పదవి దక్కే అవకాశముంది. చిరంజీవి వర్గంలో ఇప్పటికే రాయలసీమ, కోస్తా నుండి ఇద్దరికి పదవులు దక్కినందున, తెలంగాణ ప్రాంతం ఎమ్మెల్యే అనీల్‌కు కూడా విప్ కట్టబెట్టే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అలా అయితే వంగా గీతకు ఛాన్స్ ఉండదు.

English summary
It seems, major changes may occur in Kiran Kumar Reddy cabinet. Gandra Venkata Ramana Reddy may get chief whip and Chiranjeevi mla may get whip.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X