వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నా దృష్టి పదవిపైకాదు: రాహుల్, మాయపై మండిపాటు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Rahul Gandhi
లక్నో: తన చూపు ప్రధానమంత్రి పదవిపై లేదని ఏఐసిసి ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ సోమవారం ఉత్తర ప్రదేశ్‌లో అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన వారణాశి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. కొందరు ప్రధాన నేతల దృష్టి పిఎం పదవిపై ఉండవచ్చుని, కానీ తన దృష్టి మాత్రం లేదన్నారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం పైనే తాను దృష్టి సారిస్తున్నానని అన్నారు. అవినీతి అంటూ రథయాత్ర చేస్తున్న బిజెపి అగ్రనేత అద్వానికి కర్నాటకలోని అవినీతి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. అవినీతి కాంగ్రెసులోనే కాదు ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల్లోనూ ఉందన్నారు. లోక్‌పాల్‌కు రాజ్యాంగబద్దత కావాలని తాను అన్నప్పుడు ప్రతిపక్షాలు నవ్వాయని, ఇది త్వరలో అవుతుందన్నారు. ఆయన మాయావతి పైనా విరుచుకు పడ్డారు. బిఎస్పీ ప్రజల జీవితాలతో ఆడుకుంటోందన్నారు. యుపి అభివృద్ధే తన లక్ష్యమన్నారు. యుపిలో నాయకత్వ సమస్య కొట్టొచ్చినట్లు కనిపిస్తోందన్నారు. మాయా ప్రభుత్వం దాదాగిరి చేస్తోందని, 22 ఏళ్లుగా రాష్ట్ర ప్రజలు వంచనకు గురయ్యారన్నారు. ఏ పార్టీతోనూ పొత్తులుండవని స్పష్టం చేశారు. బిఎస్పీ ఆటలు ఇక సాగనివ్వమన్నారు.

బిఎస్పీ హయాంలో రాష్ట్రంలో నేరాలు పెరిగాయని అన్నారు. తనకు రాష్ట్రం కోసం పని చేయాలనే ధ్యాసే ఉందన్నారు. ప్రత్యేకంగా తమ బలం పెంచుకోవాలనే ఉద్దేశ్యం లేదన్నారు. దేశంలో కొందరు తనను నమ్ముతున్నారని, అలాగే యుపిలో ఒక్కశాతం ప్రజలు తమను నమ్మినా చాలన్నారు. నల్ల జెండాలు, బూట్లు, బుల్లెట్లు తనను ఆపలేవన్నారు. తాను దేనికీ భయపడేది లేదన్నారు. యుపిలో ఫలితాలు ఎలా ఉంటాయో చెప్పలేమన్నారు. అయితే కాంగ్రెసు మంచి ఫలితాలు సాధిస్తుందన్నారు.

English summary
Rahul Gandhi on Monday said he was not "obsessed" with becoming the Prime Minister but remained committed to transform Uttar Pradesh where people have been "fooled" for the last 22 years by successive regimes.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X