హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కేంద్రంపై ఒత్తిడి తెద్దాం: కిరణ్, టిడిపి టిఆర్ఎస్ గైర్హాజరు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kiran Kumar Reddy
హైదరాబాద్: కేంద్రం నుండి రావాల్సిన పెండింగ్ ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గురువారం రాష్ట్రానికి చెందిన పార్లమెంటు సభ్యులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన పెండింగ్ ప్రాజెక్టులను తీసుకు వచ్చేందుకు ఎంపీలంతా కేంద్రంపై ఒత్తిడి తీసుకు రావాలని సూచించారు. ఈ నెల 15న రాష్ట్రానికి రైల్వే మంత్రి రానున్న నేపథ్యంలో రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులపై ఆయనతో చర్చించుతామని చెప్పారు. రైల్వే ప్రాజెక్టులను సమష్టిగా కృషి చేసి సాధిద్దామన్నారు. పార్టీలు, ప్రాంతాలకతీతంగా ప్రాజెక్టులు వచ్చేలా చర్యలు చేపట్టాలన్నారు. ఎంపీలతో పాటు ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, మంత్రులు ధర్మాన ప్రసాద రావు, సుదర్శన్ రెడ్డి ఉంటారని చెప్పారు. ఈ సందర్భంగా ఎంపీ టి సుబ్బిరామి రెడ్డి మాట్లాడుతూ.. విశాఖను ప్రత్యేక రైల్వే జోన్‌గా ప్రకటించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఇందుకు ఎంపీలంతా సమష్టిగా కృషి చేయాలన్నారు. పెండింగ్ ప్రాజెక్టులతో పాటు కొత్త ప్రాజెక్టుల కోసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ఎంపీలందరూ నిర్ణయించుకున్నారు.

గత బడ్జెట్‌లో అమలుకు నోచుకోని కొత్త రైళ్లు, రైల్వే మార్గాలు, విద్యుదీకరణ, డబ్లింగ్ పనులు తదితర అంశాలను ఈ భేటీలో చర్చించారు. కాగా ముఖ్యమంత్రితో సమావేశానికి తెలుగుదేశం పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలు గైర్హాజరయ్యారు. ఈ సమావేశానికి పదహారు మంది ఎంపీలు హాజరయ్యారు. మీడియాకు అనుమతి నిరాకరించారు. కాగా ముఖ్యమంత్రి సమావేశంపై టిడిపి మండిపడింది. సిఎం రెండు నెలల క్రితం ఈ సమావేశం నిర్వహిస్తే బాగుండేదని అభిప్రాయపడింది. కేవలం మొక్కుబడి కోసం కంటితుడుపు చర్యగా మాత్రమే సమావేశం ఏర్పాటు చేశారని ఆరోపించింది.

English summary
CM Kiran Kumar Reddy suggested state MPs that must pressure on central government about pending railway projects.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X