బీర్ కంపెనీకి రిజిస్టర్ చేసింది నిజమే, కానీ..: మోపిదేవి

కాగా తెలుగుదేశం పార్టీ నేత వర్ల రామయ్య బుధవారం మోపిదేవి వెంకట రమణ తన కుమారుడికి ఒక ప్రముఖ బీర్ కంపెనీ అమ్మకం హక్కులు ఇప్పించుకున్నారని ఆరోపించిన విషయం తెలిసిందే. సంబంధిత పత్రాలను ఆయన మీడియాకు విడుదల చేశారు. నిండా 22 ఏళ్లు కూడా లేని తన కుమారుడు రాజీవ్ పేరిట బీర్ కంపెనీ మార్కెటింగ్ హక్కులను మోపిదేవి తీసుకున్నారని ఆయన ఆరోపించారు. రాజీవ్ నిరుడు జూన్ 16న క్రెడెన్స్ వెంచర్ క్యాపిటల్ పేరిట ఒక భాగస్వామ్య సంస్థను రిజిస్టర్ చేయించారని, సరిగ్గా నెల రోజుల్లోనే ఇన్‌బేవ్ ఇంటర్నేషనల్ అనే సంస్థ ఆంధ్రప్రదేశ్‌లో బ్లాక్ ఈగిల్ బీర్ పంపిణీ, మార్కెటింగ్ హక్కులను క్రెడెన్స్ వెంచర్‌కు అప్పగించిందని, మద్యం వ్యాపారంలో తలలు పండిన అనేక కంపెనీలు ఉండగా వీటన్నింటినీ కాదని మంత్రి కుమారుడికే మార్కెటింగ్ అవకాశం దక్కిందని, ప్రభుత్వం నుంచి పనులు చేయించుకొని, దానికి ప్రతిఫలంగా ఈ ప్రయోజనం చేకూర్చారనిసని వర్ల ఆరోపించారు.












Click it and Unblock the Notifications