బాబుతో సిఎం ఫిక్సింగ్ అవాస్తవం: డిఎల్‌కు మంత్రులు

మరోవైపు తనపై వచ్చి ఆరోపణలను రాజకీయ కోణంలో చూడవద్దని ఎక్సైజ్ శాఖ మంత్రి మోపిదేవి వెంకట రమణ శుక్రవారం మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డికి సూచించారు. ఎవరినో రక్షించేందుకు తనను బలి పశువు చేశారని డిఎల్ ప్రచారం చేయడం సరికాదన్నారు. ఆరోపణలపై డిఎల్ తనకు మద్దతిచ్చినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. అయితే ఆ ఆరోపణలను రాజకీయ కోణంలో చూడవద్దని డిఎల్‌కు సూచించారు. మంత్రివర్గంలో ఎలాంటి విభేదాలు లేవన్నారు. తనకు మద్దతిచ్చిన బిసి వర్గాలకు కూడా ఆయన థ్యాంక్స్ చెప్పారు. తనపై వచ్చిన ఆరోపణలపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి తాను వివరణ ఇచ్చుకున్నానని అందుకు ఆయన సానుకూలంగా స్పందించారని చెప్పారు. ఈ అంశంలో త్వరలో నిజాలు బయట పడతాయని చెప్పారు.












Click it and Unblock the Notifications