హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మామను చంపి పూలదండ వేశాడు: బాబుపై కెసిఆర్

By Pratap
|
Google Oneindia TeluguNews

K Chandrasekhar Rao
హైదరాబాద్: నోరు పారేసుకోకు, జాగ్రత్త అని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చేసిన హెచ్చరికపై తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావు తీవ్రంగా మండిపడ్డారు. పిల్లనిచ్చిన మామను చంపి పూలదండ వేసిన ఘనత చంద్రబాబుదని ఆయన అన్నారు. చంద్రబాబు నిజయితీతో హుందాగా వ్యవహరిస్తే తాము హుందా ఉంటామని ఆయన అన్నారు. పార్టీ పోలిట్‌బ్యూరో సమావేశానంతరం ఆయన శుక్రవారం సాయంత్రం మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ నాయకులు కారు కూతలు కూస్తున్నారని, వారి మాటలకు కర్తకర్మకర్మ క్రియ చంద్రబాబు నాయుడేనని, వారు హుందాగా ఉంటే తాము ఉంటామని ఆయన అన్నారు. తాను జయశంకర్‌ను తన్నానని అంటున్నారని, జయశంకర్ పేరు ఉచ్చరించే అర్హత కూడా తెలుగుదేశం పార్టీ నాయకులకు లేదని ఆయన అన్నారు. అటువంటి దిక్కుమాలిన ప్రచారం చేస్తూ కుసంస్కారాన్ని ప్రదర్శిస్తున్నారని ఆయన అన్నారు. ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఎప్పుడో చచ్చిపోయిందని ఆయన అన్నారు. చంద్రబాబు సొల్లు పురాణాన్ని బయటపెడితే తనను హెచ్చరిస్తున్నారని ఆయన అన్నారు. చంద్రబాబుకే కాదు, తమకు కూడా పార్టీ ఉంది, కార్యకర్తలున్నారని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీది వెన్నుపొట్ల సంస్కృతి అని ఆయన అన్నారు.

చంద్రబాబు, ముఖ్యమంత్రి కుమ్మక్కయ్యారని, కుమ్మక్కు కాకపోతే చంద్రబాబు వరంగల్ జిల్లా పర్యటనకు ఐదు వేల మంది పోలీసులతో భద్రత కల్పిస్తారా అని ఆయన అన్నారు. చంద్రబాబు, కిరణ్ కుమార్ రెడ్డి కుమ్మక్కయ్యారని వాళ్ల మంత్రే అంటున్నారని ఆయన డిఎల్ రవీంద్రా రెడ్డి వ్యాఖ్యలనుద్దేశించి అన్నారు. శాసనసభలో తాము గవర్నర్ ప్రసంగాన్ని బహిష్కరిస్తామని ఆయన అన్నారు. సకల జనుల సమ్మె విరమణ సందర్భంగా ఇచ్చిన హామీలను వేటినీ ప్రభుత్వం అమలు చేయలేదని ఆయన అన్నారు. తెలంగాణ విద్యార్థులపై రౌడీ షీట్లు తెరుస్తూ భవిష్యత్తును నాశనం చేస్తున్నారని, విద్యార్థులను అరెస్టు చేస్తున్నారని ఆయన అన్నారు. శాసనసభలో సమయం సందర్భాన్ని బట్టి తెలంగాణను ప్రస్తావిస్తామని, తెలంగాణ కోసం శాసనసభలో కచ్చితంగా పోరాడుతామని ఆయన చెప్పారు.

English summary
TRS president K Chandrasekhar Rao retaliated Telugudesam president N Chandrababu Naidu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X