సైకిల్‌కు విజయవాడ ఎంపి లగడపాటి రాజగోపాల్ ఓటు!

Lagadapati Rajagopal
విజయవాడ: కాంగ్రెసు పార్టీ విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ సైకిల్‌కు ఓటు వేశారు. అయితే ఆయన ఓటు వేసింది ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకు కాదు. సైకిల్‌కు, సైకిల్ తొక్కే వారికి. శుక్రవారం లగడపాటి రాజగోపాల్ విజయవాడలోని బిఆర్‌టిఎస్ రోడ్డులో సైకిల్ ట్రాక్‌ను ప్రారంభించారు. అనంతరం సైకిల్ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పర్యావరణ పరిరక్షణకు, ట్రాఫిక్ నియంత్రణకు, ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సైకిల్ తొక్కడం ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెసు శాసనసభ్యుడు మల్లాది విష్ణు, నగరవాసులు పాల్గొన్నారు.

కాగా అనంతరం లగడపాటి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో రైల్వే పనులు ప్రారంభించేందుకు కేంద్రాన్ని అడుగుతామన్నారు. డివిజన్ సమస్యను రైల్వే మంత్రికి వివరిస్తామని చెప్పారు. రూ.900 కోట్లతో జగ్గయ్యపేట - విష్ణుపురం, కొండపల్లి - కొత్తగూడెం ప్రాజెక్టులు ప్రారంభించేందుకు చర్యలు చేపడతామన్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడివి మాటలే తప్ప ప్రాజెక్టులు తెచ్చిన పాపాన పోలేదని విమర్శించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+