21 మంది ఎమ్మెల్యేలకు కిరణ్ కుమార్ రెడ్డి నజరానాలు

Kiran kumar Reddy
హైదరాబాద్: కాంగ్రెసు, ప్రజారాజ్యం పార్టీలకు చెందిన 21 మంది శానససభ్యులకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నజరానాలు ప్రకటించారు. నియోజకవర్గాల సంక్షేమం, అభివృద్ధి కింద వారికి నిధులు కేటాయిస్తూ ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. ఒక్కో ఎమ్మెల్యేలకు 2 కోట్ల రూపాయల నుంచి మూడు కోట్ల రూపాయల వరకు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. పార్టీలోని అసంతృప్తులను తగ్గించుకునే ఎత్తుగడలో భాగంగానే ఆయన చర్యకు దిగినట్లు చెబుతున్నారు. 21 శాసనసభ్యులకు మొత్తం 30కోట్ల రూపాయలు విడుదల చేయడానికి సిద్ధపడ్డారు.

నిధులు పొందిన శానససభ్యులు - కుంజా సత్యవతి ( రూ. 2 కోట్లు), శ్రీధర్ (2.51 కోట్లు), కవిత (2 కోట్లు), కమలమ్మ (2.7 కోట్లు), ఉషారాణి (3 కోట్లు), టివై దాసు (2 కోట్లు), ప్రవీణ్ రెడ్డి (2 కోట్లు), విజయ్ (2 కోట్లు), ప్రతాప రెడ్డి (3 కోట్లు), సుధాకర్ (2 కోట్లు), కన్నబాబు (2 కోట్లు), వరప్రసాద్ (1.05 కోట్లు), ఈలి నాని (2 కోట్లు), కాటసాని రాంరెడ్డి (2 కోట్లు), రాంభూపాల్ రెడ్డి (2.5), కోమటిరెడ్డి వెంకటరెడ్డి (2.05), బాలు నాయక్ (2 కోట్లు), లింగయ్య (2.12 కోట్లు).

రానున్న ఉప ఎన్నికలను, స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కూడా శాసనసభ్యులకు ఆ నిధులు మంజూరు చేసినట్లు భావిస్తున్నారు. వీరికి నామినేటెడ్ పదవులు ఇచ్చే అవకాశాలు కూడా లేకపోవడంతో ముఖ్యమంత్రి ఈ నిధులు విడుదల చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+