తెలంగాణ ఉద్యమమే స్ఫూర్తినిచ్చింది: ఛత్తీస్‌గఢ్ సిఎం

తెలంగాణపై కాంగ్రెస్, టిడిపి తమ వైఖరిని స్పష్టంగా ప్రకటించాలని వెంకయ్య నాయుడు డిమాండ్ చేశారు. 2004 ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ తెలంగాణకు అనుకూల ప్రకటన చేసినట్లు గుర్తు చేశారు. తర్వాత కమిటీల పేరుతో కాలయాపన చేసింది తప్ప అడుగు ముందుకు వేయలేదని విమర్శించారు. అటు తెలంగాణకు, ఇటు ఆంధ్రకు న్యాయం చేయకుండా కాంగ్రెస్ పార్టీ రెంటికీ చెడ్డ రేవడిలా మారే అవకాశముందని జోస్యం చెప్పారు. టిడిపి కూడా రెండు ప్రాంతాల్లో రెండు విధానాలను అవలంబిస్తూ ప్రజలను మోసం చేస్తోందని విమర్శించారు. త్వరలో ప్రారంభమయ్యే పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. బిల్లుకు అనుకూలంగా ఓటువేయడానికి ఎన్డీయేకు చెందిన 166 మంది ఎంపీలు సిద్ధంగా ఉన్నారన్నారు.
ఇప్పటికే తెలంగాణ జిల్లాలు అనేక సమస్యలతో అతలాకుతలమవుతున్నాయన్నారు. 2009 ఎన్నికల్లో టిఆర్ఎస్‌తో జట్టు కట్టి తెలంగాణ ఇస్తామన్న టిడిపి ఆ తర్వాత నిండా ముంచిందని ఆయన అన్నారు. కాంగ్రెస్ బుద్ధి తెచ్చుకుని తెలంగాణ బిల్లు పెట్టాలని, లేకపోతే బిజెపి ప్రత్యేక రాష్ట్రాన్ని ఇస్తుందని ప్రకటించారు. తమ పార్టీకి ఎస్ఆర్‌సితో సంబంధం లేదని, శాసనసభ తీర్మానం అంతకన్నా అవసరం లేదని అన్నారు. కాంగ్రెస్, టిడిపిలకు తెలంగాణపై చిత్తశుద్ధి, విశ్వాసం లేవని, అందుకే అవి మోసం చేస్తూ వస్తున్నాయని మండిపడ్డారు. చిన్న రాష్ట్రాలు ఏర్పడితే అభివృద్ధి కుంటుపడుతుందనడం అసత్యమని ధ్వజమెత్తారు.












Click it and Unblock the Notifications