స్టాలిన్ పథకాల కొనసాగింపు పై విజయ్ సంచలన నిర్ణయం, ఉదయనిధి హెచ్చరిక..!!

అసెంబ్లీ వేదికగా విజయ్ విశ్వాస పరీక్షలో నెగ్గారు. అనూహ్య పరిణామాల మధ్య ఊహించని సంఖ్యా బలం విజయ్ కు దక్కింది. అన్నాడీఎంకే చీలిక వర్గం నుంచి 25 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీ సాక్షిగా విజయ్ కు మద్దతు ప్రకటించారు. దీంతో.. విజయ్ ప్రభుత్వం ఇక పూర్తి స్థాయిలో పాలన సాగించనుంది. ఇదే సమయంలో అసెంబ్లీ వేదికగా విజయ్ ను ఉదయనిధి స్టాలిన్ టార్గెట్ చేసారు. డీఎంకే మిత్రపక్షాల మద్దతుతో ప్రభుత్వం సాగుతోందని వ్యాఖ్యానించారు. ఇక.. స్టాలిన్ ప్రభుత్వం లో అమలు చేసిన పథకాల కొనసాగింపు పైనా విజయ్ కీలక ప్రకటన చేసారు.

అసెంబ్లీలో విజయ్ బల పరీక్షలో నెగ్గారు.అసెంబ్లీలో జరిగిన ఓటింగ్ లో 144 మంది విజయ్ కు మద్దతు తెలిపారు. 22 మంది వ్యతిరేకంగా ఓటు వేసారు. బలపరీక్ష సమయంలో డీఎంకే వాకౌట్ చేసింది. 61 మంది ఎమ్మెల్యేలు వాకౌట్ చేసిన వారుగా తేల్చారు. బల పరీక్ష వేళ మాజీ సీఎం పళిని స్వామి నేరుగా విజయ్ ను టార్గెట్ చేసారు. ఇక.. సీఎం విజయ్‌పై ఉదయనిధి స్టాలిన్ విమర్శలు చేసారు. టీవీకే పార్టీకి మెజారిటీ రాలేదని వ్యాఖ్యానించారు. ప్రజామోదం పొందడంలో విజయ్ పార్టీ విఫలమైందని విమర్శించారు. టీవీకేకు బయట నుంచి మాత్రమే మద్దతు ఉందని చెప్పారు. 65 శాతం ప్రజలు విజయ్‌ని తిరస్కరించారని వ్యాఖ్యానించారు. అవినీతి పార్టీలతో విజయ్ పార్టీ కలిసిపోయిందని విమర్శించారు. ఇప్పటికే ప్రజల నమ్మకాన్ని విజయ్ కోల్పోయారని చెప్పారు. టీవీకేకు ఓటేసిన ప్రజలు బాధపడుతున్నారని వివరించారు.

 బల పరీక్షలో నెగ్గిన విజయ్, 144 ఎమ్మెల్యేల మద్దతు- AIADMK గల్లంతు..!!
బల పరీక్షలో నెగ్గిన విజయ్, 144 ఎమ్మెల్యేల మద్దతు- AIADMK గల్లంతు..!!
udhayanidhi-stalin-suggests-vijay-instead-of-governance-through-instagram-reel-do-some-real-go

స్టాలిన్ పథకాలు కొనసాగిస్తామని విజయ్ ప్రకటన

ఉదయనిధి వ్యాఖ్యలకు విజయ్ సమాధానం ఇచ్చారు. తమ ప్రభుత్వం హార్స్ ట్రేడింగ్ చేయలేదని.. హార్స్ స్పీడ్‌లో మా ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పుకొచ్చారు. అందరికి సామాజిక న్యాయం మా ధ్యేయంగా ప్రకటించారు. తమ ప్రభుత్వం ఐదేళ్ల పాటు కొనసాగుతుందని ధీమా వ్యక్తం చేసారు. అదే విధంగా గతంలో స్టాలిన్ ప్రభుత్వం అమలు చేసిన పథకాలను కొనసాగిస్తామ ని ప్రకటించారు. తమను వ్యతిరేకించిన వారి కోసం కూడా ప్రభుత్వం పని చేస్తుందని స్పష్టం చేసారు. ఇప్పటికే పలు మార్లు మాజీ సీఎం స్టాలిన్ తమ పథకాలను కొనసాగించాలని సూచించగా .. ఇప్పుడు అసెంబ్లీ వేదికగా విజయ్ అనుకూల ప్రకటన చేసారు. అదే విధంగా అన్నా డీఎంకే ఎమ్మెల్యేలు సభా సాక్షిగా విజయ్ కు మద్దతుగా నిలిచారు. దీంతో.. ఇప్పుడు పళిని స్వామి అన్నాడీఎంకే వర్గం అసెంబ్లీలో నామ మాత్రంగా మారుతోంది. ఈ వ్యవహారం పైన రానున్న రోజుల్లో స్పీకర్ కేంద్రంగా కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+