పాకిస్థాన్‌ను ఏమాత్రం నమ్మలేం - అమెరికా సెనెటర్
అంతర్జాతీయ వ్యవహారాల్లో పాకిస్థాన్ అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరిని అమెరికా సెనెటర్ లిండ్సే గ్రాహం తీవ్రంగా ఖండించారు. పాకిస్థాన్‌ను ఏమాత్రం నమ్మలేనని ఆయన వ్యాఖ్యానించారు. పశ్చిమాసియా ఉద్రిక్తతల వేళ, అమెరికా-ఇరాన్ (USA-Iran) శాంతి ఒప్పందానికి పాకిస్థాన్ మధ్యవర్తిత్వం వహిస్తున్న నేపథ్యంలో, ఇరాన్‌కు పాక్ సైనికంగా సహకరించిందన్న ఆరోపణలు రావడంతో లిండ్సే ఈ విధంగా స్పందించారు. దీంతో ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.
ఇంకా ఏమన్నారంటే..
లిండ్సే ఇంకా మాట్లాడుతూ.. నిజానికి “నేను పాకిస్థాన్ (Pakistan)ను ఏమాత్రం నమ్మలేను. ఆ దేశాన్ని వీలైనంత దూరంగా ఉంచుతాను. ఇరాన్ విమానాల పార్కింగ్‌కు పాక్ అనుమతిస్తే.. మధ్యవర్తిత్వానికి అమెరికా వేరొక దేశాన్ని వెతుక్కోవాలి. అందుకేనేమో శాంతి ఒప్పందం అంశం ఏటూ తేలడం లేదు” అని అనుమానాలను వ్యక్తం చేశారు.

అమెరికా దాడుల భయంతో ఇరాన్ తన వైమానిక దళానికి చెందిన కొన్ని యుద్ధ విమానాలను, గూఢచర్య, నిఘా కార్యకలాపాలకు వినియోగించే ఆర్సీ-130 విమానంతో సహా, పాకిస్థాన్‌లోని స్థావరాలకు తరలించిందని ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే ఈ కథనాలను పాకిస్థాన్ అధికారులు వెంటనే తోసిపుచ్చారు.
తమ ఎయిర్‌బేస్‌లలో ఇరాన్ సైనిక విమానాలకు ఆశ్రయం ఇచ్చినట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని ఆ దేశ సీనియర్ అధికారి స్పష్టం చేశారు. ఇదిలాఉండగా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మాత్రం పాకిస్థాన్‌కు అనుకూలంగా మాట్లాడుతూ, తమ దేశం మరో మధ్యవర్తిని వెతకడం లేదని ఆయన వెల్లడించారు.












Click it and Unblock the Notifications