జగన్‌కు సంస్కారం నేర్పమని వైయస్‌కు చెప్పా: బాబు

వారికి ఎవరు వ్యతిరేకంగా మాట్లాడినా వారిపై విరుచుకు పడుతున్నారన్నారు. నా ఆస్తులు రాసిస్తానంటే ఎవరూ ఎందుకు ముందుకు రావడం లేదన్నారు. బురద జల్లి ముఖాన వేసుకోమంటున్నారని, ఈ తీర్పు వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి చెంప పెట్టు అన్నారు. తమ పత్రిక ద్వారా న్యాయమూర్తులను బ్లాక్ మెయిల్ చేస్తూ వార్తలు రాస్తున్నారన్నారు. డబ్బుల కోసం రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని ఆరోపించారు. ఎమ్మార్‌ను భ్రష్టు పట్టించింది కాంగ్రెస్సే అన్నారు. బ్లాక్ మెయిల్, బురద రాజకీయాలకు పాల్పడుతున్నారన్నారు. తాను ఉదయం నుండి పడుకునే వరకు ఆదర్శంగా ఉండాలనే ఆలోచిస్తానని అన్నారు. ఎవరో ఒకరు కేసు వేస్తే ఊరుకోవాలా అన్నారు. విజయమ్మ ఆరోపణలు నిరాధారమన్నారు. విజయమ్మ అప్పుడే జగన్‌ను హెచ్చరిస్తే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. కాంగ్రెసు పార్టీ నేతలు తమ పిల్లలను ప్రజలకు ఇబ్బందులు కలిగించేలా పెంచుతున్నారని ఇది సరికాదన్నారు. చిత్తూరు ఫ్యాక్షనిజం లేకుండా చేశానని, కడపలో రౌడీలే ఏలుతున్నారన్నారు.
నేను ఏ తప్పు చేయలేదని నన్నెవరూ ఏమీ చేయలేరన్నారు. సింగపూరులో హోటల్ ఉందని నాపై దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. జగన్ బరి తెగించాడన్నారు. నయానో భయానో అధికార్లను బెదిరించి కాంగ్రెసు ప్రభుత్వం తప్పులు చేయించిందన్నారు. తప్పు చేయని వారికి భయం లేదని ఈ తీర్పు ద్వారా వెల్లడైందన్నారు. మద్యం సిండికేట్లపై వెనక్కి తగ్గే ప్రసక్తి లేదన్నారు. ప్రభుత్వంతో లాలూచీ పడే అవసరం తనకు లేదన్నారు. లాలూచీ పడేది బొత్స, చిరంజీవి, కిరణ్ కుమార్ రెడ్డిలేనన్నారు. సమాచార హక్కు కమిషనర్ల నియామకాన్ని తాను తిరస్కరించానని అన్నారు. బొత్సలాంటి మద్యం వ్యాపారులు మాట్లాడేదానికి విలువ ఉండదన్నారు. ఓ పార్టీగా ఉన్నప్పుడు ప్రజలు వ్యతిరేకించిన వాటిని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తాను తన ఆస్తులే కాకుండా కుటుంబ ఆస్తులు ప్రకటించానని చెప్పారు.












Click it and Unblock the Notifications