నాకు ఫ్రీ పబ్లిసిటీ, చిరంజీవిపై ఒత్తిడి తెస్తున్నాం: గంటా

భవానీ ద్వీపం విషయంలో టిడిపి నేతలపై కాంగ్రెసు నేతలు సిఎల్పీ కార్యాలయంలో ఎదురుదాడికి దిగారు. గంటా శ్రీనివాసరావుకు సంబంధించిన కంపెనీ కంటే అధిక మొత్తాన్ని చెల్లించేందుకు ఎవరైనా ముందుకొస్తే వారికి భవానీ ద్వీపం కాంట్రాక్టు అప్పగించేందుకు సిద్ధమేనని కాంగ్రెస్ శాసనసభాపక్షం పేర్కొంది. సిఎల్పీ కార్యాలయంలో ఎమ్మెల్యేలు జోగు రమేష్, రాజేశ్ తదితరులు విలేకరులతో మాట్లాడారు. ఈ ద్వీపంపై తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, ఆయన బృందం చేస్తున్న విమర్శలపై ఎక్కడైనా చర్చకు సిద్ధమేనని అన్నారు. బహిరంగ చర్చతో వాళ్ల నోళ్లు మూయించేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. తమ పార్టీ నేత చిరంజీవిపై నోటికొచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదని ఆయన వర్గం శాసనసభ్యుడు అనీల్ హెచ్చరించారు. వారిది నోరా లేక తాటిమట్టా అని అన్నారు.












Click it and Unblock the Notifications