హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రూ.1.10 లక్షల కోట్ల అప్పుల్లో ముంచారు: చంద్రబాబు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
హైదరాబాద్: కాంగ్రెసు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అప్పులను రూ.1.10 లక్షల కోట్లకు పెంచిందని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం అన్నారు. ఆయన మధ్యాహ్నం తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్టు భవనంలో మాట్లాడారు. జలయజ్ఞానికి కేటాయింపులు చూపిస్తున్నారు కానీ నిధులు కేటాయించడం లేదన్నారు. అప్పులను కాంగ్రెసు ప్రభుత్వం రూ.1.10 లక్షల కోట్లకు పెంచిందన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా పన్నులు విధించారన్నారు. మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే తలసరి ఆదాయంలో మన రాష్ట్రం పదో స్థానంలో ఉందన్నారు. విద్యుత్ వ్యవస్థను భ్రష్టు పట్టించారని ధ్వజమెత్తారు. బడ్జెట్‌లో శాఖలకు కేటాయింపులు ఆశ్చర్యకరంగా ఉన్నాయన్నారు.

రాజీవ్ యువకిరణాల పేరుతో గొప్పలు చెప్పి ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ఫీజు రీయింబర్సుమెంట్సు ఫార్సుగా తయారు కాబోతుందన్నారు. సైన్స్ సిటీ ఎత్తేశారని, నాలెడ్ట్ సిటీ ఎక్కడుందో తెలియకుండా పోయిందన్నారు. ఆదాయానికంటే రెట్టింపు పన్నులు విధించారని, సామాన్యుడిపై మోయలేని భారం మోపారన్నారు. ఎనిమిదేళ్లలో బిసి సంక్షేమానికి ఈ ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టిందో చెప్పాలన్నారు. బడ్జెట్ దోచుకోవడానికి తప్ప ప్రజలకు ఉపయోగపడేలా లేదన్నారు. జలయజ్ఞం గుది బండగా మారిందని, దానిని కాంగ్రెసు ధనయజ్ఞంగా మార్చిందన్నారు. ఆర్థికాభివృద్ధిలో మనం జార్ఖండ్ కంటే వెనుకబడి ఉన్నామన్నారు.

ఆనం బడ్జెట్ పిట్టల దొర మాట్లాడినట్లు పిచ్చి మాటల్లా ఉందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత గట్టు రామచంద్రా రావు విమర్శించారు. ప్రభుత్వం ప్రాజెక్టులతో పాటు పలు అంశాలపై ఆనం అంకెల గారడి వాస్తవాలను ప్రతిబింబించేలా లేదన్నారు.

English summary
TDP chief Nara Chandrababu Naidu accused Congress government for dumping state in debts.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X