తెలంగాణ ఉప ఎన్నికల్లో సత్తా చాటుతాం: బాబు

Chandrababu Naidu
హైదరాబాద్: తెలంగాణ ఉప ఎన్నికల్లో తమ సత్తా చాటుతామని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. మీరే చూస్తారు కదా అని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. తెలంగాణలోని ఆరు స్థానాలకు, కొవ్వూరుకు తెలుగుదేశం పార్టీ దాదాపుగా అభ్యర్థులను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. స్టేషన్ ఘనపూర్ ‌నుంచి కడియం శ్రీహరిని, నాగర్ కర్నూలు నుంచి మర్రి జనార్దన్ రెడ్డిని పోటీకి దించే యోచనలో తెలుగుదేశం పార్టీ ఉంది. కోవ్వూరు నుంచి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని పోటీకి దించాలని తెలుగుదేశం చూస్తోంది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నుంచి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి పోటీకి దిగనున్నారు.

తెలంగాణలోని ఉప ఎన్నికల్లో సమన్వయానికి పార్టీ తెలంగాణ ఫోరానికి చెందిన ఎర్రబెల్లి దయాకర్ రావు, టి. దేవేందర్ గౌడ్, మోత్కుపల్లి నర్సింహులులతో ఓ కమిటీ వేయనుంది. ఉప ఎన్నికలు జరిగే స్థానాలకు శాసనసభ్యులతో, నాయకులతో సమన్వయకర్తలను వేయాలని నిర్ణయించింది. అదిలాబాద్ జిల్లాకు సుద్దాల దేవయ్య, ఎల్ రమణ, విజయరామారావు, మొరకరు సమన్వయకర్తలుగా ఉంటారు. స్టేషన్ ఘనపూర్‌ నియోజకవర్గానికి రేవూరి ప్రకాశ్ రెడ్డి, సీతక్క, సత్యవతి, సండ్ర వెంకటవీరయ్య సమన్వయకర్తలుగా ఉంటారు.

కామారెడ్డి నియోజకవర్గానికి మండవ వెంకటేశ్వర రావు, అన్నపూర్ణమ్మ, హనుమంత షిండే సమన్వయకర్తలుగా వ్యవహరిస్తారు. మహబూబ్ నగర్ నియోజకవర్గానికి సీతా దయాకర్ రెడ్డి, ఎర్ర శేఖర్, ఎల్లయ్య సమన్వయకర్తలుగా వ్యవహరిస్తారని సమాచారం. నాగర్ కర్నూలుకు కొత్తకోట దయాకర్ రెడ్డి, జైపాల్ యాదవ్, రేవంత్ రెడ్డి సమన్వయ కర్తలుగా ఉంటారు. కొల్లాపూర్ నియోజకవర్గానికి రావుల చంద్రశేఖర రెడ్డి, రాములు సమన్వయకర్తలుగా వ్యవహరిస్తారని తెలుస్తోంది. తెలుగుదేశం తెలంగాణ ఫోరం నాయకులు శుక్రవారం సాయంత్రం నారా చంద్రబాబు నాయుడితో సమావేశమై ఉప ఎన్నికలపై చర్చించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+