హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణలో ఉప ఎన్నికలకు అభ్యర్థులు సిద్ధం: సిఎం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kiran Kumar Reddy
హైదరాబాద్: ఉప ఎన్నికల అభ్యర్థుల ఎంపిక కొలిక్కి వచ్చిందని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి శుక్రవారం చెప్పారు. ఎన్నికల్లో తమ పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థుల పేర్లను ఆదివారం పార్టీలో మరోసారి చర్చించి అధిష్టానానికి పంపిస్తామని ఆయన చెప్పారు. ఉప ఎన్నికల్లో ప్రచారానికి వెళ్లే విషయం ఆలోచిస్తామన్నారు. తెలంగాణలోని ఆరు, ఎస్పీఎస్ నెల్లూరు జిల్లాలోని కొవురూ నియోజకవర్గానికి ఈసి నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. తెలుగుదేశం, తెలంగాణ రాష్ట్ర సమితి అన్ని పార్టీల ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు తాము నిధులు కేటాయిస్తున్నామని సిఎం చెప్పారు. పార్టీలకతీతంగా అన్ని పార్టీల ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో అవసరమైన చోట అభివృద్ధి పనులు జరుగుతున్నాయని చెప్పారు. ఎమ్మెల్యేలకు నిధులు ఇవ్వలేదనటం వాస్తవం కాదన్నారు. ఉప ఎన్నికలు లేకుంటే కల్వకుర్తి నుంచి నీరు విడుదలయ్యేదని చెప్పారు. ఈ బడ్జెట్‌లో ఎక్కడా పన్నుల మాట రాలేదన్నారు.

వచ్చే మూడేళ్లలో జలయజ్ఞం కింద మూడు లక్షల ఎకరాలకు అదనంగా నీరు అందిస్తామని చెప్పారు. జలయజ్ఞానికి నిధులు తగ్గించలేదని, నిధులు మిగిలి పోకుండా ఎంత ఖర్చు పెట్టారో అంతే ఇచ్చామన్నారు. ఎక్సైజ్ విధానంలో ఆదాయమే తమకు మార్గం కాదన్నారు. ఈ బడ్జెట్‌లో రూపాయికి కిలో బియ్యం, విద్యుత్, ఫీజు రీయింబర్సుమెంట్సు కోసం రూ.5వేలకు పైగా పెంచామన్నారు. కొత్త ఏక్సైజ్ పాలసీ అధ్యయానికి మంత్రులను ఇతర రాష్ట్రాలకు పంపిస్తామన్నారు. నా ఇరవై ఏళ్ల రాజకీయ జీవితంలో ఇదే అత్యుత్తమ బడ్జెట్ అని చెప్పారు. బడ్జెట్ లీక్ కాలేదన్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సమాచార కమిషనర్ల పేర్లను పరీశీలన కమిటీకి పంపించమని లేఖ రాశారని, అది డీసెంట్ నోట్ అవుతుందో కాదో వారే చెప్పాలన్నారు.

ఆర్థిక శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రవేశ పెట్టిన బడ్జెట్‌ను అంకెల గారడి అని ప్రతిపక్షాలు చెప్పడం సరికాదని మంత్రి పార్థసారథి వేరుగా అన్నారు. సంక్షేమ రంగాలకు పూర్తిగా బడ్జెట్‌లో న్యాయం చేశామన్నారు. కొందరు దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి పేరు చెప్పుకొని పబ్బం గడిపే ప్రయత్నాలు చేస్తున్నారని, వారికి ప్రజా సంక్షేమంపై చిత్తశుద్ధి లేదన్నారు.

English summary
CM Kiran Kumar Reddy said that bypoll Congress Party candidates were confirmed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X