వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టిఆర్ఎస్‌కు షాక్, అసెంబ్లీలో బడ్జెట్‌కు ఈసి గ్రీన్‌సిగ్నల్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Election Commission
న్యూఢిల్లీ: బడ్జెట్ ప్రవేశ పెట్టే అంశంపై కేంద్ర ఎన్నికల సంఘం నుండి తెలంగాణ రాష్ట్ర సమితికి షాక్ తగిలింది. రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం మధ్యాహ్నం గం.12.10 నిమిషాలకు అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్ ప్రవేశ పెడుతున్న విషయం తెలిసిందే. అయితే ఇదే సమయంలో ఎన్నికల సంఘం తెలంగాణలోని ఆరు నియోజకవర్గాలు, సీమాంధ్ర ప్రాంతంలోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కొవ్వూరు నియోజకవర్గానికి ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో టిఆర్ఎస్ నేతలు బడ్జెట్ ప్రవేశ పెట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. అయితే వారి ఫిర్యాదును పరిశీలించిన ఈసి బడ్జెట్ ప్రవేశ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. శాసనసభా వ్యవహారాలకు ఎన్నికల కోడ్ వర్తించదని చెప్పింది. బడ్జెట్‌ను యథాతథంగా ప్రవేశ పెట్టుకోవచ్చునని తెలిపింది. టిఆర్ఎస్ అభ్యర్థనను తోసిపుచ్చింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి బడ్జెట్ పెట్టడంలో ఇబ్బందులు తొలగిపోయాయి.

అంతకుముందు టిఆర్ఎస్ సిరిసిల్ల శాసనసభ్యుడు కల్వకుంట్ల తారక రామారావు, కొప్పుల ఈశ్వర్ తదితరులు హైదరాబాదులో అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. రాష్ట్రం ప్రభుత్వం బడ్జెట్‌ను ఉప ఎన్నికల వరకు వాయిదా వేసుకోవాలని డిమాండ్ చేసింది. ఇప్పుడు బడ్జెట్ ప్రవేశ పెడితే ఉప ఎన్నికల్లో ఓటర్లు ప్రభావితమయ్యే అవకాశముందని వారు అనుమానం వ్యక్తం చేశారు. ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నందున కేంద్ర బడ్జెట్‌ను వాయిదా వేసుకున్న సంగతిని వారు గుర్తు చేశారు. అసెంబ్లీలో వారు బడ్జెట్‌ను ఇప్పుడు ప్రవేశ పెట్టవద్దని ఆందోళన చేశారు. ఈ విషయమై ఈసికి ఫిర్యాదు చేస్తామని చెప్పారు.

English summary
Election Commission gave green signal to propose state budget in Assembly to government. TRS complained against budget proposal to EC today as bypoll notification release.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X