హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సిఎం పోస్టుపై జానారెడ్డి కామెంట్, మంత్రుల చురకలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Jana Reddy
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యేందుకు తన అనుభవం సరిపోదా? అని మంత్రి జానా రెడ్డి గురువారం అన్నారు. అసెంబ్లీలోని తన చాంబర్‌లో జానా విలేకరులతో పిచ్చాపాటిగా మాట్లాడారు. ఈ సందర్భంగా విలేకరులు తెలంగాణకు సిఎం అవుతారా అంటూ ప్రశ్నించగా, ఎపికి సిఎం అయ్యేందుకు నా అనుభవం సరిపోదా అంటూ తిరిగి ప్రశ్నించారు. దానికి అక్కడే ఉన్న మంత్రి సుదర్శన్ రెడ్డి చురకలు వేశారు. జానారెడ్డి ఎపిలాంటి పెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారని, తెలంగాణలాంటి చిన్న రాష్ట్రానికి కాదన్నారు. ఈ సందర్భంగా జానా మాట్లాడుతూ... తెలంగాణ వస్తే చాలని, తనకు మంత్రి పదవి అవసరం లేదన్నారు. సీనియర్ నేత పాల్వాయి గోవర్దన్ రెడ్డిని తొలి ముఖ్యమంత్రిని చేయడంలో అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. తెలంగాణ వస్తే ముఖ్యమంత్రి కావాలా వద్దా అనేది తన వ్యక్తిగత నిర్ణయమన్నారు. అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుంటే.. కాసు బ్రహ్మానంద రెడ్డి తర్వాత నేనే సీనియర్‌ను అని మరో ఆర్నెళ్ల తర్వాత మంత్రిగా పదవీకాలం విషయంలో రికార్డు సాధిస్తానని చెప్పారు.

నల్లగొండలో తనను ఓడించేందుకు చాలా ప్రయత్నాలు జరిగాయో లేదో జిల్లా నేతలను అడగండి అన్నారు. రాజకీయాల నుంచి తప్పుకోవాలనుకుంటున్నానని జానారెడ్డి అన్నారు. అందుకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి... రాజకీయాల నుంచి తప్పుకుంటానని జానా ఇరవై ఏళ్లుగా చెబుతున్నారని, మేమంతా ముసలోళ్లమైపోతున్నామే తప్ప, ఆయన రాజకీయాల నుంచి తప్పుకోవడం లేదని అన్నారు. దీనికి జానారెడ్డి నవ్వి ఊరుకున్నారు.

English summary
Minister Jana Reddy asked that is his experience will not enough to CM post. Ministers Uttam Kumar Reddy and Sudershan Reddy were responded on his comments.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X