బడ్జెట్‌ను ఉప పోరు వరకు వాయిదా వేయండి: కెటిఆర్

కాగా శుక్రవారం ఉదయం సమావేశాల్లో అదే తీరు కొనసాగింది. ఉదయం సభ ప్రారంభమైన పది నిమిషాలకే వాయిదా పడింది. మద్యం సిండికేట్లపై చర్చ జరపాలని తెలుగుదేశం పార్టీ, తెలంగాణ తీర్మానం ప్రవేశ పెట్టాలని టిఆర్ఎస్ సభ్యులు ఆందోళన చేశారు. స్పీకర్ పోడియంను చుట్టుముట్టారు. దీంతో స్పీకర్ నాదెండ్ల మనోహర్ సభను అరగంట పాటు వాయిదా వేశారు. కాగా ఈ రోజు మధ్యాహ్నం గం.12.10 నిమిషాలకు ఆర్థిక శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు. మా ప్రభుత్వం ప్రవేశ పెట్టిన అన్ని పథకాలకు నిధుల కేటాయింపులో సమ ప్రాధాన్యత ఉంటుందని ఆనం చెప్పారు. బడ్జెట్ లీక్ కాలేదన్నారు. ఒకటి రెండు అంశాలు లీకైనా ఇబ్బంది లేదన్నారు. తమ ప్రభుత్వానికి అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లు అని చెప్పారు. కేటాయించిన పథకాలకు ఆర్థిక శాఖ నిధులు విడుదల చేస్తుందని చెప్పారు.












Click it and Unblock the Notifications