వారు సాక్షులా, నిందితులా తర్వాత చెప్తాం: సిబిఐ

జగన్ అక్రమాస్తుల వ్యవహారంలో అప్పటి పరిశ్రమల శాఖ కార్యదర్శి శ్రీలక్ష్మి, గనుల శాఖ డైరెక్టర్ రాజగోపాల్‌ను ప్రశ్నించేందుకు అనుమతివ్వాలని కోర్టును సీబీఐ కోరింది. శ్రీలక్ష్మి, రాజగోపాల్‌లను కస్టడీకి ఇవ్వాలని కోరుతూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌పై నాంపల్లి సీబీఐ కోర్టులో గురువారం వాదనలు జరిగాయి. "మా క్లయింట్లు ఓబుళాపురం మైనింగ్ కేసులో నిందితులుగా ఉన్నారు. సీబీఐ వేరే కేసును ప్రస్తావిస్తూ పిటిషన్ వేసింది. ఇది సరి కాదు. ఓబుళాపురం కేసులో ఇప్పటికే చాలా మందిని సీబీఐ ప్రశ్నించింది. అప్పుడు మాట్లాడకుండా, మా క్లయింట్లను కస్టడీకి ఇవ్వాలని ఇప్పుడెందుకు అడుగుతోంది?'' అని అన్నారు. వాదనల అనంతరం న్యాయమూర్తి కేసును శుక్రవారానికి వాయిదా వేశారు. అదే రోజు కౌంటర్ దాఖలుకు డిఫెన్స్‌కు అవకాశం ఇచ్చారు.












Click it and Unblock the Notifications