బిఎంసి శివసేనదే: కూటమి హవా, చతికిలపడ్డ కాంగ్రెస్

Bal Thackrey
ముంబై: బృహన్ ముంబయి మున్సిపల్ ఎన్నికలలో శివసేన - భారతీయ జనతా పార్టీ కూటమి అత్యధిక సీట్లు కైవసం చేసుకుంది. మొత్తం 227 సీట్లలో శివసేన - బిజెపి కూటమి 107 సీట్లు గెలుచుకుంది. కాంగ్రెసు - ఎన్సీపి 65 సీట్లతో సరిపెట్టుకుంది. రాజ్ థాకరేకు చెందిన మహారాష్ట్ర నవనిర్మాణ సేన(ఎంఎన్ఎస్) పార్టీ 28 సీట్లు, ఇతరులు 27 గెలుచుకున్నారు. మున్సిపాలిటీని దక్కించుకునేందుకు ముంబయి ప్రజలు ఏ పార్టీకి కూడా స్పష్టమైన మెజార్టీ ఇవ్వలేదు. బిజెపి - శివసేన కూటమి అడుగు దూరంలో ఉంది. మున్సిపాలిటీని దక్కించుకునే అవకాశం ఈ కూటమికే ఉంది. ఇరవై ఏడుగురు ఉన్న స్వతంత్రులు, ఇతరులలో ఏడుగురు ఆ కూటమికి మద్దతిచ్చే అవకాశముంది. దీంతో శివసేన - బిజెపి కూటమి మున్సిపాలిటీని దక్కించుకోనుంది. మళ్లీ ముంబయిని శివసేన కూటమే చేజిక్కించుకోవడంతో ఆ పార్టీలో ఆనందాలు వెల్లువిరిశాయి. 227 స్థానాల నండి 2232 మంది అభ్యర్థులు పోటీ చేశారు.

థానే మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికలలోనూ శివసేన - బిజెపి కూటమే ఆధిక్యతలో ఉంది. కడపటి వార్తలందేసరికి శివసేన 52, బిజెపి 8, కాంగ్రెసు 18, ఎన్సీపి 34, ఎంఎన్ఎస్ 7, ఆర్పీఐ1 సీటు గెలుచుకున్నాయి. పూణేలో మాత్రం శరద్ పవార్ నాయకత్వంలోని ఎన్సిపి ఆధిక్యతలో కొనసాగుతోంది. 76 సీట్ల ఫలితాలు వెల్లడయ్యాయి. ఎన్సిపి 25 సీట్లు, కాంగ్రెసు 14, బిజెపి 12, ఎంఎన్ఎస్ 17, శివసేన 5, ఆర్పీ 2 సీట్లు గెలుచుకున్నాయి. ముంబయి, థానే తదితర పట్టణాల్లో కాంగ్రెసు ఎన్సిపి కలిసి పోటీ చేయగా పూణేలో మాత్రం విడివిడిగా పోటీ చేశాయి. శివసేన, బిజెపి, ఆర్పీఐలు కూటమిగా బరిలో దిగాయి.

మహారాష్ట్రలో 10 మున్సిపల్ కార్పోరేషన్లకు, 27 జిల్లా పరిషత్, 309 పంచాయతీ సమితి స్థానాలకు ఫిబ్రవరి 7వ తేదిన ఎన్నికలు జరిగాయి. కాగా పది మున్సిపాలిటీల్లో మూడింటిని శివసేన-బిజెపి దక్కించుకుంది. కాగా బిఎంసి ఎన్నికలను శివసేన ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ ఫలితాలు కాంగ్రెసు - ఎన్సిపి కూటమికి చెంపపెట్టు అని శివసేన వ్యాఖ్యానించింది. ఆ పార్టీలను ముంబయి ప్రజలు చావుదెబ్బ కొట్టారని పార్టీ తెలిపింది. ఎన్నికల ప్రచారం సందర్భంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీ చౌహాన్.. ఫలితాలు వెల్లడైన తర్వాత బాల్ థాకరే అడ్రస్ ఉండదని వ్యాఖ్యానించడాన్ని శివసేన సవాల్‌గా తీసుకుంది. థాకరేకు జరిగిన అవమానాన్ని ముంబయి ప్రజలు తట్టుకోలేక పోయారని ఆ పార్టీ పేర్కొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+