స్త్రీల మొబైల్స్ ఆసక్తిపై జైరాం వివాదాస్పద వ్యాఖ్య

భారతదేశం వైరుధ్యాలమయమని, దేశంలోని 60 శాతం మంది బహిరంగ ప్రదేశాల్లో మలమూత్రాలు చేస్తారని, అదే దేశంలో 700 మిలియన్ల మొబైల్ ఫోన్లున్నాయని ఆయన అన్నారు. టాయిలెట్లు నిర్మించినప్పటికీ వాటిని వాడరని ఆయన అన్నారు. మంచినీరు, పారిశుధ్య శాఖను కూడా నిర్వహిస్తున్న జైరాం రమేష్ త్వరలోనే పరిస్థితిని మారుస్తామని చెప్పారు. మహిళలు టాయిలెట్లను వాడకపోవడానికి గల కారణం అడగ్గా కొన్ని సాంస్కృతి నియమాలు పనిచేస్తున్నాయని జవాబిచ్చారు. మహిళ స్వయం సహాయక గ్రూపులకు టాయిలెట్ల నిర్మాణం ప్రధానమైన అంశం కావాలని ఆయన అన్నారు.
గుజరాత్‌లో 1970లో పాల ఉత్పత్తి విషయంలో వచ్చిన శ్వేత విప్లవంపై గ్రామీణ మహిళల్లో వచ్చిన మార్పును శ్యాంబెనెగల్ మంథన్ సినిమా ద్వారా చూపించారని గుర్తు చేస్తూ పారిశుధ్యంపై బెంగాల్ ఓ సినిమా నిర్మించాలని అన్నారు. సామాజిక నిబంధనలను బద్దలు కొట్టడానికి మంథన్ మాదిరిగా టాయిలెట్ల వాడకంపై ఓ సినిమా పశ్చిమ బెంగాల్ నిర్మించగలదని ఆయన అన్నారు.