హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ కేసులో మరో ఐఎఎస్ విచారణ, మీడియాపై ఆరా

By Pratap
|
Google Oneindia TeluguNews

CBI
హైదరాబాద్: వైయస్ జగన్ ఆస్తుల కేసులో సిబిఐ అధికారులు శుక్రవారం మరో ఐఎఎస్ అధికారిని ప్రశ్నించారు. అలాగే సాక్షి దినపత్రికకు, చానెల్‌కు ప్రభుత్వం ఇచ్చిన వాణిజ్య ప్రకటనలపై కూడా ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం కేంద్ర పర్యావరణ కార్యదర్శిగా చేస్తున్న ఆంధ్రా కేడర్ ఐఏఎస్ అధికారి తిష్యా రక్షిత్ చటర్జీని సాక్షిగా సిబిఐ అధికారులు శుక్రవారం రెండున్నర గంటల పాటు ప్రశ్నించారు.

గతంలో ఆయన రాష్ట్ర పర్యావరణ, రహదారులు భవనాల శాఖల్లో ముఖ్య హోదాల్లో పనిచేశారు. ఆ సమయంలో జగన్ కేసుకు సంబంధించి జారీ అయిన రెండు జీవోల గురించి సీబీఐ అధికారులు చటర్జీని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. వాన్‌పిక్‌కు భూ కేటాయింపులు జరిగినపుడు అటవీ,పర్యావరణ చట్టానికి సంబంధించి కొన్ని సడలింపులు ఇచ్చారని, ఈ విషయంలో నిబంధనలు పాటించారా? ఏదైనా ఒత్తిళ్లకు గురై అనుమతులు ఇవ్వడం జరిగిందా అనే విషయాలపై చటర్జీ నుంచి సీబీఐ అధికారులు వివరణ కోరినట్లు సమాచారం. ఆ తర్వాత వాన్‌పిక్ ప్రతినిధులు సీబీఐ ముందు మరోసారి హాజరయ్యారు.

వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో మిగతా మీడియా సంస్థలను పక్కకుపెట్టి జగన్ మీడియాకు ప్రభుత్వం ప్రకటనలు ఇవ్వడంపై సీబీఐ దృష్టి సారించింది. ఈ నెల 21న సీబీఐ కార్యాలయానికి హాజరు కావాల్సిందిగా ప్రకటనలు జారీ చేసిన సమయంలో సమాచార శాఖ కమిషనర్‌గా వ్యవహరించిన సి.పార్థసారథి, అదనపు డైరెక్టర్ ప్రభాకర్‌రావు, జాయింట్ డైరెక్టర్ రాజబాబులకు నోటీసులు జారీ చేసింది.

English summary
CBI has grilled another IAS officer in YSR Congress president YS Jagan assets case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X